అమ‌రావ‌తిలో దొంగ‌లు ప‌డ్డారు.. త‌స్మాత్ జాగ్ర‌త్త : నారా లోకేష్‌

0
232

వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన నాటి నుంచి రాష్ట్రంలో అభివృద్ధి కార్య‌క్ర‌మాలు ఆగిపోయాయ‌ని, ప్ర‌జ‌ల‌కు సంక్షేమ ప‌థ‌కాల ఫ‌లాలు అంద‌డం లేద‌ని టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ అన్నారు. పోల‌వ‌రంలో, అమ‌రావ‌తిలో ప‌నులు జ‌ర‌గ‌డం లేదంటూ వైసీపీ ప్ర‌భుత్వంపై నారా లోకేష్ విమ‌ర్శలు గుప్పించారు.

ఒక్క అవ‌కాశం అన్న నినాదంతో వైసీపీ అధికారంలోకి వ‌చ్చింద‌ని, నాటి నుంచి అమ‌రావ‌తిలో దొంగ‌లుప‌డి ఇసుక‌, స్టీల్‌, సిమెంట్ ఇలా అన్ని సామాన్ల‌ను ఎత్తుకెళ్లిపోతున్నార‌ని, తస్మాత్ జాగ్ర‌త్త అంటూ లోకేష్ సెటైరిక‌ల్ వ్యాఖ్య‌లు చేశారు. వైఎస్ జ‌గ‌న్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఒక్క అవ‌కాశం ఇవ్వండి.. ఇవ్వండి.. ఇవ్వండి అంటూ వెళ్లాడ‌ని, జ‌గ‌న్ మాట న‌మ్మిన ప్ర‌జ‌లు ఒక్క అవ‌కాశం ఇచ్చార‌ని, కానీ జ‌గ‌న్ మాత్రం వారి మాట‌ను వ‌మ్ముచేసి అభివృద్ధినంతా ముంచేశార‌న్నారు.