నాని కెరియర్ లో….నిలిచిపోయే సినిమాగా…’జెర్సీ’

0
201

“ఆపేసి ఓడిపోయినవాడు ఉన్నాడు కానీ, ప్రయత్నిస్తూ ఓడిపోయినవాడు లేడు’. అనే డైలాగ్ వింటే చాలు ప్రతి ఒక్కరిలో మార్పు రావాల్సిందే. ఈ డైలాగ్ ఎందులోదా అని ఆలోచిస్తే, కొంతసేపటి క్రితమే సంక్రాంతి పండుగ సందర్బంగా ‘జెర్సీ’సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు.

గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో, నాని కథానాయకుడిగా ‘జెర్సీ’సినిమా  లో నటించాడు. నానికి జంటగా శ్రద్ధాశ్రీనాథ్ నటించింది. ఈ సినిమాలో నాని మనకు ఒక క్రికెటర్ గా అర్జున్ పాత్రలో కనిపించడం విశేషం.  ఇక ఈ సినిమా లో నాని  ఒక క్రికెటర్ గా తాను అనుకున్న స్థాయికి  చేరడానికి ఎన్నోకష్టాలు పడుతూ, ఎన్నో అవమానాలను ఎదుర్కొంటు, విజయానికి  వయస్సు కూడా అడ్డు రాదని ఈ సినిమాలో నిరూపిస్తాడు. చివరకు తన గెలుపు అన్నికష్టాలను మరచిపోయేలా చేయడాన్నిఈ టీజర్ లో చూపించారు. ఈ సినిమా ఏప్రిల్ లో ప్రేక్షకుల కళ్ళముందుకు రానుంది.

నాని అంటె కథను సెలెక్ట్ చేసుకోవడంలో చాలా ఆలోచించి అడుగు వేస్తారు. ఇప్పటి వరకు వచ్చిన సినిమాల కన్నా ఈ ‘జెర్సీ’సినిమా లో తన పాత్ర పోషించడానికి చాలానే కష్టపడ్డాడట. తప్పకుండా ఈ సినిమా తన కెరీర్ లో గొప్పగా నిలిచిపోతుందని నాని భావిస్తున్నారు.

#Nani #JerseryTeaser :