నందిత శ్వేత విభిన్నపాత్రలో.. ‘ఐపీసీ 376’: ఫస్ట్ లుక్

0
417
Nanditha swetha
Nanditha swetha movie IPC 376 first look

‘ఎక్కడికిపోతావు చిన్నవాడా’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైనా నందితశ్వేత నటించిన తీరు ఇప్పటికి ఎవరు మరచిపోలేరు. ఈ సినిమాతో శ్వేతకు మంచి గుర్తింపు లభించింది. అంతేకాకుండా ఫిలింఫేర్ అవార్డు అందుకుందని అందరికి తెలిసిందే. అప్పటినుండి నందిత శ్వేతా నటనకు ఏకంగా హీరోయిన్ ప్రాధాన్యత కలిగిన కథలు మాత్రమే వెతుకుతూ మరి వస్తున్నాయి. అటు తెలుగులోనూ, తమిళంలోనే మంచి అవకాశాలను చేజిక్కుంచుకుంది నందిత. ఆ విధంగా నాయిక ప్రాధాన్యత తో కూడిన ‘అక్షర’ సినిమా తెలుగులో నటిస్తుంది. తమిళంలో మరో సినిమాను చేస్తుంది.

రామ్ కుమార్ సుబ్బరామన్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘ఐపీసీ 376’. ఎస్.ప్రభాకర్ నిర్మాతగా వ్యవహరిస్తున్న సినిమాలో నందిత శ్వేతా ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ సినిమాను టాలీవుడ్ లోను, కోలీవుడ్ లో విడుదల చేయు దిశగా ఆలోచనలున్నాయట. రెండు భాషల్లో విడుదలయ్యే సినిమా టైటిల్ మాత్రం ఒకటేనట. తాజాగా చిత్ర యూనిట్ సినిమాకు సంబందించిన నందిత శ్వేత తో కలిగి ఉన్నా ఫస్టు లుక్ విడుదల చేశారు. ఫస్టులుక్ లో శ్వేతా డిఫరెంట్ లుక్ లో కనిపించింది. దీని ద్వారా ఆమె విభిన్నమైన పాత్రను పోషిస్తూ ప్రేక్షకులను మెప్పించేలా ఉన్నట్లు కనిపిస్తుంది. ఈ సినిమాకు సంబందించిన పూర్తి వివరాల కోసం మరి కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందె.