నందినిరెడ్డి చీర‌క‌ట్టుకు దూరం.. అస‌లు కార‌ణం ఇదే..!

0
326

టాలీవుడ్ మ‌హిళా ద‌ర్శ‌కురాలు నందినిరెడ్డి సినీ ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌య‌మైన నాటి నుంచి ప్యాంట్‌, ష‌ర్టులోనే ద‌ర్శ‌న‌మిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇదే విష‌యానికి సంబంధించిన ప్ర‌శ్న ఇటీవ‌ల ఓ ప్ర‌ముఖ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో నందినిరెడ్డికి ఎదురైంది. కాగా, నందినిరెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో స‌మంత కీల‌క పాత్ర పోషించిన ఓ బేబీ చిత్రం థియేట‌ర్ల‌లో విజ‌య‌వంతం ప్ర‌ద‌ర్శింప‌బ‌డుతున్న సంగ‌తి తెలిసిందే.

ఓ బేబీ చిత్రం ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా సోష‌ల్ మీడియా ప్రేక్ష‌కుల‌కు చేరువైన గంగ‌వ్వ‌తోటి ఇంట‌ర్వ్యూ ప్లాన్ చేయ‌గా, స‌మంత, నందినిరెడ్డి ఇద్ద‌రూ పాల్గొన్నారు. ఇంత‌లో గంగ‌వ్వ మీరు ఎప్పుడూ ప్యాంట్‌, ష‌ర్టు వేసుకుంటారు క‌దా..! మీ ఆయ‌న ఏమ‌న‌డా..? అని నందినిరెడ్డిని ప్ర‌శ్నించ‌గా, అందుకు నందినిరెడ్డి స్పందిస్తూ త‌న‌కు పెళ్లే కాలేద‌ని చెప్పింది. ఇంటి ప‌నులు, డైరెక్ష‌న్ ప‌నులు చేసేందుకు చీర క‌డితే ఇబ్బందిగా ఉంటుంద‌ని, ఆ కార‌ణంగానే తాను ప్యాంటు, ష‌ర్టు ధ‌రిస్తానంటూ గంగ‌వ్వ ప్ర‌శ్న‌కు స‌మాధానంగా చెప్పింది.