జ‌గ‌న్ వ‌ద్ద‌కు నందికొట్కూరు పంచాయ‌తీ..!

0
243

నందికొట్కూరులో వైసీపీ విజ‌యం.. అటు రాష్ట్రంలో కూడా పార్టీ అధికారంలోకి రావ‌డంతో ఆ పార్టీ నేత సిద్దార్థ‌రెడ్డి, ఎమ్మెల్యే ఆర్థ‌ర్‌రెడ్డికి మ‌ధ్య ప‌వ‌ర్ వార్ మొద‌లైన‌ట్టు సోష‌ల్ మీడియాలో క‌థ‌నం వైర‌ల్ అవుతోంది. నియోజ‌క‌వ‌ర్గంలో అధికారుల బ‌దిలీల నుంచి పార్టీలో చేరిక‌ల వ‌ర‌కు అంతా కూడా త‌న క‌నుస‌న్న‌ల్లోనే సాగాల‌ని బైరెడ్డి సిద్దార్థ‌రెడ్డి తేల్చి చెబుతున్నార‌ని, ఆఖ‌రికి అభివృద్ధి కార్య‌క్ర‌మాల విష‌యంలోనూ త‌న‌దే తుది నిర్ణ‌యం అంటూ బైరెడ్డి సిద్ధార్థ‌రెడ్డి చెబుతున్న‌ట్టు క‌థ‌నం పేర్కొంటోంది.

మ‌రోప‌క్క, ఎమ్మెల్యేగా తాను ఉండ‌గా నియోజ‌క‌వ‌ర్గంలో సిద్ధార్థ‌రెడ్డి పెత్త‌న‌మేంటంటూ ఆర్థ‌ర్ బ‌హిరంగంగానే ప్ర‌శ్నిస్తున్నారు. ఇలా ఇద్ద‌రి మ‌ధ్య మొదలైన ఆధిప‌త్య‌పోరు నందికొట్కూరు నియోజ‌క‌వ‌ర్గంలో సెగ‌లు రేజేస్తుంద‌ట‌. బైరెడ్డి రాజ‌శేఖ‌ర్‌రెడ్డి త‌మ్ముడి కుమారుడైన సిద్దార్థ‌రెడ్డి అత్యంత వేగంగా దూకుడుతో యువ‌నేత‌గా పేరు తెచ్చుకున్నారు. అటు ఆర్థ‌ర్ కూడా క‌ష్ట‌ప‌డుతూనే పైకొచ్చారు. ఇద్ద‌రూ కూడా వారి వారి పంత‌మే నెగ్గాల‌న్న విష‌యంలో ఏ మాత్రం వెన‌క్కు త‌గ్గ‌కపోవ‌డంతో నందికొట్కూరు వైసీపీ రాజ‌కీయాలు ముదురుతున్న‌ట్టు స‌మాచారం.