జ‌న‌సేన‌కు నాదెండ్ల మ‌నోహ‌ర్ గుడ్ బై..!

0
335

ఈ ద‌ఫా ఏపీలో జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో విజ‌య‌మే లక్ష్యంగా బ‌రిలోకి దిగిన జ‌న‌సేన ఘోర ఓట‌మిని చ‌విచూసింది. స్వ‌యాన జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణే తాను పోటీచేసిన రెండుచోట్లా ఓడిపోవ‌డంతో పార్టీ శ్రేణులు ఒక్క‌సారిగా డీలాప‌డ్డారు. దీంతో ఎన్నిక‌ల స‌మ‌యంలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన వారంతా ఒక్కొక్క‌రుగా పార్టీని వీడేందుకు సిద్ధ‌ప‌డుతున్నారు. ఆ క్ర‌మంలోనే మాజీ మంత్రి రావెల కిశోర్‌బాబు ఇప్ప‌టికే రాజీనామా చేశారు. ఆయ‌న అతి త్వ‌ర‌లో బీజేపీ తీర్ధం పుచ్చుకోనున్నార‌న్న వార్త‌లు వైర‌ల్‌గా మారాయి.

ఈ నేప‌థ్యంలో జ‌న‌సేన‌లో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన అత్యంత కీల‌క నేత నాదెండ్ల మ‌నోహ‌ర్ కూడా పార్టీని వీడేందుకు సిద్ధ‌ప‌డ్డారా..? అన్న ప్ర‌శ్న‌కు రాజ‌కీయ విశ్లేష‌కులు అవున‌నే స‌మాధానం ఇస్తున్నారు. స్వ‌యాన పార్టీ అధినేత నిర్వ‌హించిన గుంటూరు జిల్లా స‌మీక్ష‌కు నాదెండ్ల మ‌నోహ‌ర్ హాజ‌రుకాక‌పోవ‌డం రాజ‌కీయ విశ్లేష‌కుల వాద‌న‌కు బ‌లం చేకూరిన‌ట్ల‌యింది. జ‌న‌సేన‌కు నాదెండ్ల గుడ్ బై చెప్పే యోచ‌నాలో ఉన్న‌ట్టు వారు చెబుతున్నారు.

రాజ‌కీయ విశ్లేష‌కుల వాద‌న‌పై జ‌న‌సేన శ్రేణులు సైతం స్పందిస్తున్నారు. నాదెండ్ల మ‌నోహ‌ర్ అమెరికా ప‌ర్య‌ట‌న‌లో ఉన్నార‌ని, ఆ కార‌ణంగానే ఆయ‌న గుంటూరు జిల్లా జ‌న‌సేన స‌మీక్షా స‌మావేశానికి హాజ‌రుకాలేక‌పోయార‌ని చెబుతున్నారు. కొంద‌రు కావాల‌నే నాదెండ్ల మ‌నోహ‌ర్ పార్టీని వీడ‌నున్నారంటూ క‌థ‌నాల‌ను ప్ర‌చారం చేస్తున్నార‌ని వారు అంటున్నారు. ఏదేమైనా జ‌న‌సేన‌ను ఆయ‌న వీడే ప్ర‌స‌క్తే లేద‌ని వారు స్ప‌ష్టం చేస్తున్నారు.