ఎన్టీఆర్ జయంతి సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ నిర్ణయం..!

0
147

మాజీ ముఖ్య మంత్రి నందమూరి తారక రామారావు జయంతి ఈరోజు. పువ్వులతో కళకళలాడాల్సిన ఎన్టీఆర్ ఘాట్.. వెలవెలపోయింది. ఈ సంఘటన పై జూనియర్ ఎన్టీఆర్ అసంతృప్తిని వ్యక్తం చేశాడు.

ఈరోజు తెల్లవారుజామున సీనియర్ ఎన్టీఆర్ కు నివాళులు అర్పించేందుకు నందమూరి వారసులు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఘాట్ కి చేరుకున్నారు. సమాధికి కానీ, చుట్టుపక్కల పరిసరాలలో కానీ ఎక్కడ పుష్పాలతో అలంకరణ లేకుండా.. వెలవెల పోయి కనిపించడంతో హృదయం చెలించిపోయింది. కొద్దీ సమయం వరకు అక్కడే కూర్చొని మౌనం వహించారు ఇద్దరు. మనవళ్ళిద్దరు వెంటనే చుట్టుపక్కల ఉన్న అభిమానులను పిలచి పువ్వుల అలంకరణ చేయమని పురమాయించారు. జూ.ఎన్టీఆర్, కళ్యాణ్ స్వయంగా  పుష్పములను గుచ్చి, అభిమానుల సహాయంతో అలంకరించి నివాళులు అర్పించారు.

ప్రతి సంవత్సరం జీహెచ్ఎంసి అధికారులు పుష్పాలంకార బాధ్యత తీసుకుంటారు. కానీ ఈ సారి మాత్రం వారు ఏ విధమైన చర్యలు తీసుకోలేదు. ప్రతి సంవత్సరం లాగానే పార్టీ నుంచి జయంతి వేడుకలు జరపవల్సిందిగా ఒక లెటర్ కూడా పంపించారట. కానీ వారు రెస్పాన్స్ కాకపోవడం చాలా బాధాకరమని టీడీపీ నేతలు తెలిపారు. ఈ సందర్బంగా జూనియర్ ఎన్టీఆర్ స్పందిస్తూ.. తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన సీనియర్ ఎన్టీఆర్ ఘాట్ ను అలంకరించలేదని ఆవేదనను వ్యక్తం చేస్తూ .. వచ్చే ఏడాది నుంచి తానే స్వయంగా బాధ్యతను తీసుకుంటున్నట్లు తెలిపాడు.