బిగ్‌బాస్ -3 : నాగార్జున సంచ‌ల‌న ట్వీట్‌..!

0
1750

టాలీవుడ్ మ‌న్మ‌థుడు హోస్ట్‌గా బిగ్‌బాస్ రియాల్టీ షో సీజ‌న్ నెం.3 ఆదివారం రాత్రి బుల్లితెర‌పై ప్రసారమైన సంగ‌తి తెలిసిందే. ఊహించ‌ని కంటెస్టెంట్‌ల‌తో బిగ్‌బాస్ అభిమానుల‌కు షాక్ ఇచ్చాడు. ప్ర‌ముఖ న‌టి హేమ‌, యాంక‌ర్ శ్రీ‌ముఖి, తీన్మార్ సావిత్రి, వ‌రుణ్ సందేశ్ దంప‌తుల పేర్లు షో ప్రారంభానికి ముందే లీక్ అయినా.. ఊహించ‌ని రీతిలో అలీ, బాబా మాస్టర్, సింగర్ రాహుల్ సప్లిగంజ్, టీవీ9 జాఫర్, హిమజ, పునర్నవి, రోహిణి, మహేష్, ఆషు రెడ్డి బిగ్‌బాస్‌ హాస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. దీంతో షోపై ప్రేక్ష‌కుల్లో కాస్త ఉత్కంఠ రేకెత్తింది.

షో ప్రారంభంలో నాగార్జున త‌న స్టైల్లో కంటెస్టెంట్‌ల‌ను ఆహ్వానిస్తూ, బిగ్‌బాస్ హౌస్‌లో ఏం చేయ‌నున్నారు..? అంటూ ప్ర‌శ్న‌లు వేసి వారి నుంచి స‌మాధానాలు రాబ‌ట్టారు. మ‌రికొంద‌రితో క‌లిసి డ్యాన్స్ కూడా చేశారు. కంటెస్టెంట్ త‌రుపు వ‌చ్చిన బంధువుల‌ను ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం చేస్తూ, విజేత‌గా నిల‌వాలంటూ వారికి ఆల్‌ద బెస్ట్ చెప్పారు నాగార్జున.

ఇలా ఎన్నో ఆస‌క్తిక‌ర విష‌యాల‌తో మొద‌లైన బిగ్‌బాస్ -3 షో ఇప్పుడు సంచ‌ల‌నాల‌కు కేరాఫ్‌గా మారింది. అంతేకాదు వ‌ర‌ల్డ్‌వైడ్ టీవీ ప్రోగ్రామ్‌ల‌లో బిగ్‌బాస్ -3 తెలుగు షో ట్రెండింగ్‌లో నిలిచింది. ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ నాగార్జున త‌న ట్వీట్ట‌ర్‌లో పోస్టు చేశారు. తాను హోస్ట్ చేస్తున్న బిగ్‌బాస్ -3 ఫ‌స్ట్ షోను వ‌ర‌ల్డ్ ట్రెండింగ్‌లో ఫ‌స్ట్‌ప్లేస్‌లో నిల‌బెట్టిన ప్రేక్ష‌కుల‌కు నాగార్జున కృత‌జ్ఞ‌తలు తెలిపారు. బిగ్‌బాస్ -3 విజ‌య‌వంతం చేసేందుకు ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ ఇలాగే కొన‌సాగాలంటూ నాగార్జున ట్వీట్‌లో పేర్కొన్నారు.