తెలంగాణ‌లో మోగిన పంచాయ‌తీ ఎన్నిక‌ల న‌గారా..!

0
200

తెలంగాణ‌లో పంచాయ‌తీ ఎన్నిక‌ల న‌గారా మోగింది. ఇప్ప‌టికే 3.36 ల‌క్ష‌ల‌కు పైగా బ్యాలెట్ పేప‌ర్ల‌ను సిద్ధం చేసింది. అలాగే, నిన్న‌టి నుంచే ఎన్నిక‌ల కోడ్ కూడా అమ‌ల్లోకి వ‌చ్చేసింది. మొత్తం 12,732 గ్రామ పంచాయ‌తీల‌కు మూడు విడ‌త‌ల్లో ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌ను పూర్తి చేయ‌నుంది.

జ‌న‌వ‌రి 7న తొలి విడ‌త‌, జ‌న‌వ‌రి 11న రెండో విడ‌త జ‌న‌వ‌రి 16న మూడో విడ‌త ఎన్నిక‌ల నోటిఫికేష‌న్‌ను విడుద‌ల చేయ‌నున్నారు. మొద‌టి విడ‌త‌లో 4,480, రెండో విడ‌త‌లో 4,137, మూడో విడ‌త‌లో 4,115 గ్రామ పంచాయ‌తీల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఇక పోలింగ్ విష‌యానికొస్తే 21, 25, 30వ తేదీల్లో ఎన్నిక‌లు జ‌రుగుతాయి. దెబ్బ‌తిన్న విప‌క్షాలు లోక‌ల్ ఫైట్‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంటున్నాయి.

తెలంగాణ‌లో 1,49,52,000 మందికిపైగా ఓట‌ర్లు ఉండ‌గా కొత్త‌గా మ‌రో 16 ల‌క్ష‌ల మంది ఓటు హ‌క్కు పొందారు. ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ లోపు న‌మోదు చేసుకున్న అంద‌రికీ ఓటువేసే హ‌క్కు క‌ల్పిస్తామ‌ని, అలాగే 18 ర‌కాల గుర్తింపు కార్డుల ద్వారా ఓటు హ‌క్కును వినియోగించుకోవ‌చ్చు. మ‌రో వైపు వివిధ కార‌ణాల‌తో మొత్తం 4,52,093 ఓట్ల‌ను తొల‌గించారు. అటు ఆయా పంచాయ‌తీల్లో పోటీ చేసే అభ్య‌ర్థుల సంఖ్య‌నుబ‌ట్టి ఎన్ని గుర్తులు కేటాయించాల‌న్న‌దానిపై అధికారులు ప్ర‌క‌టించ‌నున్నారు.