ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఒక్కొక్క‌డికి చుక్క‌లు చూపిస్తాడు : నాగ‌బాబు

0
209

2024లో జ‌ర‌గనున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో జ‌న‌సేన అధికారంలోకి రావ‌డం ఖాయ‌మ‌ని, త‌న త‌మ్ముడు పవ‌న్ క‌ళ్యాణ్ ముఖ్యమంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌డం త‌ధ్య‌మ‌ని మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు అన్నారు. కాగా, నాగ‌బాబు త‌న‌కున్న సోష‌ల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని స్వ‌యంగా తెలిపారు. ఒక్కొక్క‌డికి చుక్క‌లు చూపిస్తాడు అన్న క్యాప్ష‌న్‌తో సందేశాన్ని విడుద‌ల చేశారు.

ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో టీడీపీ ప్ర‌భుత్వంపై ఉన్న వ్య‌తిరేక‌త ప్ర‌జ‌ల్లో స్ప‌ష్టంగా క‌నిపించింద‌ని నాగ‌బాబు పేర్కొన్నారు. ఎన్నిక‌ల్లో జ‌న‌సేన పోటీచేసినా ప‌వ‌న్ క‌ళ్యాన్ ప్ర‌భుత్వాన్ని న‌డ‌ప‌గ‌ల‌డా..? అన్న సందేహం ప్ర‌జ‌ల్లో క‌లిగింద‌ని, అందుక‌నే వైసీపీకి ప‌ట్టంక‌ట్టిన ప్ర‌జ‌లు జ‌గ‌న్‌ను ముఖ్య‌మంత్రి చేశార‌న్నారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో త‌న‌ను క‌లిసిన కొంద‌రు ప్ర‌జ‌లు 2024లో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను త‌ప్ప‌కుండా ముఖ్య‌మంత్రిగా గెలిపించుకుంటాం.. కానీ ఈ ద‌ఫా మాత్రం వైఎస్ జ‌గ‌న్‌కే త‌మ ఓటు అంటూ చెప్పిన విష‌యాల‌ను నాగ‌బాబు గుర్తు చేశారు.