నిజం క‌క్క‌లేని బ‌యోపిక్‌లొద్ద‌యా..! నాగ‌బాబు మ‌రో కౌంట‌ర్.!!

0
651

న‌ట సింహం నంద‌మూరి బాల‌కృష్ణ గురించి అడిగిన యాంక‌ర్‌కు.. బాలకృష్ణ‌నా..? ఆయ‌న నాకు తెలియ‌క పోవ‌డ‌మేంటండీ బాబూ. ఆయ‌న ఒక అద్భుత‌మైన న‌టుడు, అంత‌కు మించి క‌డుపుబ్బా న‌వ్వించే స్టార్ క‌మెడియ‌న్. ఇప్ప‌టికీ సినిమాల్లో న‌టించే సీనియ‌ర్ క‌మెడియ‌న్‌లు, కొత్త‌గా వ‌చ్చే క‌మెడియ‌న్‌లు ఆయ‌న్నే ఆద‌ర్శంగా తీసుకుంటారని చెప్పి అంటూ ఓ ఇంట‌ర్వ్యూలో మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు దారి తీసిన సంగ‌తి తెలిసిందే.

నాగ‌బాబు చేసిన ఆ వ్యాఖ్య‌లతో మెగా అభిమానులు, నంద‌మూరి అభిమానుల మ‌ధ్య సోష‌ల్ మీడియా వేదిక‌గా ఓ మినీ యుద్ధ‌మే జ‌రిగింది. ఆ వేడి ఇంకా చ‌ల్లార‌క ముందే నాగ‌బాబు మ‌రో పోస్టుతో నిప్పుకు ఆజ్యం పోసినంత‌ప‌ని చేశాడు. ఇప్పుడు ఈ పోస్ట్ సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అయిపోయింది. అయితే, నాగ‌బాబు చేసిన ఈ పోస్ట్ ఎవ‌రిని ఉద్దేశించి చేశార‌న్న‌ది క్లారిటీ రావాల్సి ఉంది.

Stay Tuned 🙌

Naga Babu ಅವರಿಂದ ಈ ದಿನದಂದು ಪೋಸ್ಟ್ ಮಾಡಲಾಗಿದೆ ಗುರುವಾರ, ಜನವರಿ 3, 2019