ముదురుతున్న నందమూరి, కొణిదెల యుద్ధం

0
184

నాగబాబుకి గుర్తింపు అంటే చిరంజీవి తమ్ముడు. పవన్ కల్యాణ్ అన్న అని మాత్రమే… కలదు. కానీ కొద్దీ రోజులుగా నందమూరి తారక రామారావు కుమారుడు. బాలకృష్ణలఫై రెచ్చిపోతున్న విషయం మనందరికి  తెలిసిందే. మెగా ఫ్యామిలీలో మెగా బ్రదర్స్ ఇద్దరు ఇటు సినిమాలు, అటు రాజకీయాలు చేసుకుంటూనే పోతున్నారు. కానీ ఇపుడు నాగబాబు,  బాలయ్య  విషయమే సంచలనం సృష్టిస్తుంది. ఇష్టం వచ్చినట్లు.. తిట్లు  లంకించుకున్న  వీడియోలు వరుసగా విడుదల కావడం అందరికి తెలిసిందే. అందుకేనెమో  దీనికి  ఒక పులిస్టాప్ పెట్టాలనిపించిదనుకుంటా. కొత్తగా ఫినిషింగ్ టచ్ ఇచ్చినట్లే ఇచ్చి, ఇదిగో మర్యాదగా చెప్తున్నాని మళ్ళి ఓ వీడియో విడుదల  చేసారు. ఇది తిరిగి మళ్ళి మొదలు పెట్టినట్లే అనిపించిందేమో ప్రేక్షకులకు సంబంధం లేని ఎవరో నాగబాబు కి కౌంటరు  ఇచ్చారు.  ఈ వీడియో ఫై విమర్శలు ప్రతి విమర్శలు చాలానే వచ్చాయి.  ఈ  కౌంటర్ కి నాగబాబు రియాక్ట్ అయ్యాడు. కానీ బాలకృష్ణ మాత్రం  ఆ వాక్యాల అర్దపరమార్ధాలు బాగానే  అర్ధం చేసుకుంటున్నట్లున్నాడు..  చిన్న చిరునవ్వుతో  నో కామెంట్ అని రెస్పాన్స్ అయ్యాడు.  ఇక ఇపుడైన నాగబాబు ఆలోచించాలి కానీ  నాగబాబు కోరుకున్నది ఏంటో ఉన్నట్లుంది . అందుకే  నాగబాబు   కంటిన్యూ అవుతూనే  ఉన్నారు.

సీనియర్ ఎన్టీఆర్ ఫై  ట్విట్ లో పవన్  వాఖ్య :

ఇలా నాగబాబు, బాలకృష్ణ  వాక్యాలు ఒక సంచలనం అయితే  ఇపుడు ఇందులోకి తమ్ముడు  కూడా వచ్చి చేరడం  మరో సంచలనము  అయింది . ఏకంగా తమ్ముడు  సీనియర్ ఎన్టీఆర్ ఫై వ్యాఖ్యలు చేస్తూ  ట్వీట్ చేశారు. ఈ ట్విట్  లో ఎన్టీఆర్ గారు మెదక్ లో కుక్కను నిలబెట్టిన గెలుస్తుంది అని, ఆ ఎన్నికలలో ఆయన పరాజయం పాలయ్యారు”. అని చేసి నాగ బాబు కి తమ్ముడు తోడయ్యాడు.  ఎన్టీఆర్   గర్వం తో రాజకీయాలు చేసారు.  అలాంటి రాజకీయాలు  నేను  చేయను, అంత గర్వం  నాకు లేదని అని చెప్పడం మరో విశేషం. ఇలా ఏకంగా ఎన్టీఆర్ తోనే పొల్చుకున్నారు. ఇలా అన్నదమ్ములిద్దరూ… ఒకే సారి.. ఎందుకు ఒకే కుటుంబంపై, విరుచుకుపడి పాపులారిటీ తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నారన్నదానికి మాత్రం రాజకీయం అనే ఆన్సరే వస్తుంది. కానీ.. ఇలాంటి రాజకీయాలు వర్కవుట్ అవుతాయో లేదో  అన్నది మాత్రం చూడాల్సిందే…  !