నాగ‌బాబు, బాల‌కృష్ణ ఇద్దరూ క‌లిసి భోజ‌నం చేశారు..!

0
188

మెగా ఫ్యామిలీ, నంద‌మూరి ఫ్యామిలీ స‌భ్యులు ఎప్పుడూ క‌లిసే తిరుగుతుంటారు. అటువంటిది వీళ్ల‌కు వాళ్లు తెలీదు.. వాళ్ల‌కు వీళ్లు తెలీదు అంటూ మ‌నం మాట్లాడుకోవ‌డం అన‌వ‌స‌రం అంటూ సినీ నిర్మాత‌ తమ్మారెడ్డి భ‌ర‌ద్వాజ అన్నారు. కాగా, ఇవాళ ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ మాట్లాడుతూ ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను చెప్పుకొచ్చారు.

బాల‌కృష్ణ ఎవ‌రో త‌న‌కు తెలీద‌ని నాగ‌బాబు అన్నారంటే ఏదో జోక్ చేసి ఉంటాడు. బాల‌కృష్ణ ఎవ‌రో నాగ‌బాబుకు తెలీకుండా ఉండే ఛాన్సే లేద‌న్నారు. అయితే, వీడియో సోష‌ల్ మీడియాలో పోస్ట్ అయిన వెంట‌నే బాల‌కృష్ణ నాగ‌బాబు ఇంటికెళ్లి మాట్లాడార‌ని, ఇద్ద‌రూ క‌లిసి లంచ్ కూడా చేశారంటూ యూ ట్యూబ్‌లో ఓ వీడియో పోస్ట్ అయింద‌ని, ఆ వీడియో నిజ‌మై ఉంటే సంతోషించే వారిలో తాను ముందుంటాన‌ని త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ అన్నారు.

అంతెందుకు నంద‌మూరి ఫ్యామిలీ ఇంట ఏ కార్య‌క్ర‌మం జ‌రిగినా మెగా ఫ్యామిలీ పాల్గొంటుంద‌ని, అలాగే మెగా ఫ్యామిలీలో ఏ కార్య‌క్ర‌మం జ‌రిగినా నంద‌మూరి ఫ్యామిలీ పాల్గొంటుంద‌న్నారు. వాళ్ల‌కు వీళ్లు తెలీదా..? అంటూ ఫ్యాన్స్‌కూడా చ‌ర్చ‌లు పెడుతూ వారి వారి ఫ్యాన్స్ విలువైన స‌మ‌యాన్ని వృధా చేసుకుంటున్నార‌న్నారు.

కే.ఏ.పాల్ కూడా బాల‌కృష్ణ ఎవ‌రో నాకు తెలీద‌ని చెప్పారు క‌దా..? అన్న ప్ర‌శ్న‌కు త‌మ్మారెడ్డి స‌మాధానం ఇస్తూ ఆయ‌న అలా అన‌డంలో అర్థం ఉంది. ఎందుకంటే కే.ఏ.పాల్ దేశ విదేశాల్లో తిరిగే వ్య‌క్తి. ఆయ‌న్ను ప్ర‌ముఖ ఛానెల్ ఫ్యాన్స్ న్యూస్ వాళ్లే ఇంట‌ర్వ్యూ చేశారు. అంతేకాకుండా, అమెరికా ప్రెసిడెంట్‌ల‌తో చ‌ర్చించి పీస్ మిష‌న్‌ను నడిపారు కూడా. అత‌ని ప‌రిధికి అత‌ను గొప్ప వ్య‌క్తి.

అంతెందుకు అప్పుడెప్పుడో ప్ర‌ముఖ ఇండ్ట్రియ‌లిస్ట్ టాటా విమానంలో ప్ర‌యాణిస్తున్న స‌మ‌యంలో ప‌క్క‌నే ఉన్న దివంగ‌త న‌టుడు దిలీప్ కుమార్‌ను గుర్తు ప‌ట్ట‌లేదు. దిలీప్ కుమార్ నేను యాక్ట‌ర్ దిలీప్ కుమార్ అని మూడు సార్లు చెప్పినా టాటా ప‌ట్టించుకోకుండా ఓ అవునా..! అంటూ గ‌మ్మునుండిపోయాడు. అలాంటిది కే.ఏ.పాల్ బాల‌కృష్ణ ఎవ‌రో తెలీద‌ని చెప్ప‌డంలో ఆశ్చ‌ర్య‌మేమీ లేద‌న్నారు తమ్మారెడ్డి భ‌ర‌ద్వాజ‌.