నా పార్టీ టికెట్ ఇవ్వాలంటే ఆ అర్హ‌త‌లు ఉండాల్సిందే :కేఏ పాల్‌

0
127

తాను స్థాపించిన ప్రజాశాంతి పార్టీ త‌రుపున టికెట్ పొందాల‌నుకుంటున్న వారికి తాను చెప్పిన ప్ర‌తీ అర్హ‌త ఉండాల్సిందేన‌ని పార్టీ వ్య‌వ‌స్థాప‌కులు కే.ఏ.పాల్ అన్నారు. కాగా, ఇవాళ మీడియాతో మాట్లాడిన కే.ఏ.పాల్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడుపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

పొత్తుల‌పై ఉన్న ధ్యాస రాష్ట్ర ప్ర‌జ‌ల‌పై, పాల‌న‌పై లేదంటూ సీఎం చంద్ర‌బాబుపై మండిప‌డ్డారు. సీఎం చంద్ర‌బాబు నాయుడు సిగ్గులేకుండా ఖ‌రుకు ఏపీని అడ్డ‌గోలుగా చీల్చిన జాతీయ పార్గ‌టీలైన కాంగ్రెస్‌, బీజేపీల‌తో పొత్తు పెట్టుకోవ‌డ‌మేంట‌ని కే.ఏ.పాల్ చంద్ర‌బాబుపై ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు. ఏపీ అప్పుల రాష్ట్రంగా మార‌డానికి ప్ర‌ధాన కార‌ణం సీఎం చంద్ర‌బాబు అంటూ కే.ఏ.పాల్ మండిప‌డ్డారు.

వ‌చ్చే మార్చి నాటికి తాను స్థాపించిన ప్ర‌జాశాంతి పార్టీని పూర్తి స్థాయిలో నిర్మాణం జ‌రిపి, ఆ త‌రువాత‌నే పొత్తుల‌పై ఆలోచిస్తామ‌ని కే.ఏ.పాల్ చెప్పారు. త‌మ పార్టీ నుంచి టికెట్ ఆశించిన వారు ప‌ది వేల మంది సభ్య‌త్వాలు చేయాల్సిందేన్నారు.