మా అమ్మ చివరి కొరిక అది…

0
102

ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ క్రైస్తవ మత బోధకుడు కిల్లరీ ఆనంద్ పాల్ తల్లి గారి స్వర్గస్తులయ్యారు… ఆయన తల్లి కిలారి సంతోషమ్మ అనారోగ్యంతో బాధపడుతూ విశాఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఫిబ్రవరి 10వ తేదీ ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఈమె వయస్సు 78 సంవత్సరాలు. ఈ విషయాన్ని కేఏ పాల్ స్వయంగా ఫేస్ బుక్ ద్వారా వెల్లడించారు. ప్రభువుతో ఆమె కలిసిపోయిందని.. జనవరిలో ఆమెతో మాట్లాడడం జరిగిందని జ్ణాపకాలను గుర్తు చేసుకున్నారు.

సమాజం నుండి మనం సహాయం పొందినపుడు మనంకూడా ఈ సమాజానికి ఏదో ఒక రూపం లో సహాయాన్ని అందించడం మన బాధ్యత అని తన తల్లిగారు ఎపుడు చెప్పేవారని, అందుకే మాతల్లి గారు తనకు ఎప్పుడు సమాజం గురించి ఎపుడు చెప్తూ ఉండేవారని గుర్తుచేసుకున్నారు పాల్..తన తండ్రి గారు కూడా ఎప్పుడు ప్రజలకు ఏదో ఒక విధంగా ఉపయోగపడాలని, మదర్ థెరిస్సా వంటి వారి ఆశయాలను నెరవేర్చలని అందరికీ న్యాయం చేయాలని చెప్తూ ఉండేవారని ఈ సంధర్భంగా గుర్తు చేసుకున్నారు పాల్…

అంతే కాకుండా మా తండ్రి గారు ఒకప్పుడ్ రాజకీయాల్లో కి కూడా రావాలని అనుక్కున్నారు, కానీ అప్పట్లో పేదరికంలో ఉండడం వల్ల, అది నెరవేరలేదు అని గుర్తు తెచ్చుకున్నారు పాల్. కాని నన్ను ఒక మంచి రాజకీయ నాయకుడిని, చేయాలనే కోరిక మా నాన్నగారికి ఉండేదని, దాన్ని నెరవేర్చడం కోసమే తాను ఈ పార్టీని పెట్టినట్టు చెప్పుకొచ్చారు పాల్. పార్టీ పెట్టిన తరువాత తన తల్లి గారు, చాలా సంతోషించరాని, ఎలాగైనా ఏపీ కి సిఎం అయితే చూడాలని, ఉండేదని, అది తన చివరికోరిక అని, అది నెరవేర్చే పనిలోనే ఉన్నానని చెప్పుకొచ్చారు పాల్…

చిన్నప్పటి నుండి పేదరికంలో బతికిన తనకు జీవితం మీద, కసి పెరిగి ఇంత వాడినయ్యాను అని, నేను ఎలా ఎదిగానో అందరికీ తెలిసిందే అని, నా జీవితం తెరిచిన పుస్తకమే అన్నీ అన్నారు కె ఏ పాల్…

అంతే కాకుండా ప్రజాశాంతి తరపున ఎన్నికల్లో పోటీ చేయాలని.. తన తల్లి సంతోషమ్మ సూచించినట్లు చెప్పుకొచ్చారు. సొంత ఇల్లు, కారు, ఒక్క రూపాయి లేకపోయినా.. నిత్యం పేదల బాగు కోసం ఆమె ప్రార్థించే వారని గుర్తు చేసుకున్నారు. ఆమె కన్నుమూయడంతో ప్రపంచమంతా సంతాపాన్ని తెలుపుతోందని కె.ఏ.పాల్ సందేశంలో స్పష్టం చేశారు. ఆమె అంత్యక్రియలు పాల్ ఆడిటోరియంలో ఫిబ్రవరి 11వ తేదీ సోమవారం సాయంత్రం 3 నుంచి 5 గంటల వరకు జరుగుతాయని ప్రకటించారాయన.