అయ్య‌ప్ప భ‌క్తుల‌కు ముస్లింల అన్న‌దానం..!

0
274

రాజ‌న్న సిరిసిల్ల వీర్న‌ప‌ల్లి మండ‌లంలో అయ్య‌ప్ప భ‌క్తుల‌కు ముస్లిం భ‌క్తులు అన్న‌దానం నిర్వ‌హించారు. అయితే, అయ్య‌ప్ప స్వాముల‌కు ముస్లింలు అన్న‌దాన కార్య‌క్ర‌మం నిర్వ‌హించ‌డం స్వాతంత్రానికి ముందు నుంచే వీర్న‌ప‌ల్లిలో ఆన‌వాయితీగా వ‌స్తోంది.

గురుస్వాముల ఆధ్వ‌ర్యంలో అయ్య‌ప్ప దీక్షా ప‌రులు ఇరుముడి కార్య‌క్ర‌మాన్ని ఘ‌నంగా నిర్వ‌హించారు. అయ్య‌ప్ప స్వాముల‌కు భిక్ష నిర్వ‌హించ‌డం స‌ర్వ మ‌తాలు భ‌గ‌వంతుని దృష్టిలో స‌మాన‌మేనంటూ ముస్లిం సోద‌రులు ప్ర‌పంచానికి చాటిచెప్పారు. ఇక హిందువులు కూడా రంజాన్ పండుగ‌కు ఇఫ్తార్ విందు ఇవ్వ‌డం ఇక్క‌డ ఆన‌వాయితీగా వ‌స్తుంద‌ని స్థానికులు చెబుతున్నారు.