ముర‌ళీమోహ‌న్‌కు ఏమైంది?

0
156

ముర‌ళీమోహ‌న్‌కు ఏమైంది?..ముర‌ళీమోహ‌న్‌కు ఏమైంది?.. ఈ అంశం వారంరోజులుగా నెట్టింట్లో నానుతోంది. తెలుగుసీనియ‌ర్ న‌టుడి ఆరోగ్యంపై అనేక‌మంది అనేక రకాలుగా పోస్టులు, వ్యాఖ్య‌లు చేస్తున్నారు. అటు, ఫిల్మ్ న‌గ‌ర్ లోనూ ఈ అంశం మీద చ‌ర్చ న‌డుస్తోంది. దీంతో డైరెక్ట్ గా ముర‌ళీమోహ‌నే నేరుగా రంగంలోకి దిగి త‌న ఆరోగ్యంపై ఒక వీడియో రిలీజ్ చేశారు.

కేర్‌ ఆసుపత్రి బృందం వెన్నుముకకు సంబంధించిన చికిత్సను త‌న‌కు ఎంతో జాగ్రత్తగా అందించిందని, తాను ప్రస్తుతం క్షేమంగానే ఉన్నానని స‌ద‌రు వీడియో సందేశం ద్వారా ముర‌ళీమోహ‌న్‌ వెల్లడించారు. తన తల్లి అస్థికలను నిమజ్జనం చేసేందుకు వారణాసి వెళ్లిన త‌న‌కు వెన్నుముఖ లో ఇబ్బందులు త‌లెత్తిన సంగ‌తిని వెల్ల‌డించారు. ఇంకా ఆయ‌న ఏమంటున్నారో ఆయ‌న మాట‌ల్లోనే..

మురళీమోహన్ ఆరోగ్యంపై రూమర్లు.. క్లారిటీ ఇచ్చిన సీనియర్ హీరో.. మెగాస్టార్ పరామర్శ

Posted by Telugu Filmibeat on Saturday, June 1, 2019