రాజధాని లో ఈ-బిజ్ పేరుతో భారీ మోసం..1000 కోట్ల భారీ స్కాం

0
149
eBIZ Multi Level Marketing Busted In Hyderabad
రాజధాని లో ఈ-బిజ్ పేరుతో భారీ మోసం..1000 కోట్ల భారీ స్కాం

హైదరాబాద్ లో బయటపడిన మరో మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కాం వెలుగు చూసింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 1000 కోట్ల భారీ స్కాం బయటపడింది. నిరుద్యోగ యువతను టార్గెట్ చేసుకొని ఈ-బిజ్ సంస్థ పేరుతొ భారీగా వసూలు చేశారు. కేటుగాళ్లు వీరి అకౌంట్లో ఉన్న 70 కోట్ల రూపాయలను పోలీసులు సీజ్ చేశారు. ఈ కేసు దర్యాప్తు చేపట్టిన సీపీ సజ్జనార్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ సంస్థ యొక్క కీలక విషయాలను బయటపెట్టారు.

2001 సం లో నోయిడా కేంద్రంగా స్థాపించిన ఈ-బిజ్ సంస్థ. ఇందులో ఈ సంస్థ కు సంబందిచిన బ్యాంక్ అకౌంట్స్ వున్నాయి, బిల్లింగ్స్ , ప్రోడక్ట్స్ ఉన్నాయని ఇప్పటీకే ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి దాదాపు 70 కోట్ల రూపాయలను సీజ్ చేసినట్టు సైబరాబాద్ అధికారులు చెపుతున్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మల్టీ లెవెల్ మార్కెటింగ్ లో చైన్ సిస్టం ప్రకారం ఈ మార్కెటింగ్ లో తక్కువ పెట్టుబడి పెట్టి లక్షలో డబ్బును సంపాదించవచ్చని చెప్పి మోసాలకు పాల్పడ్డారు. ఈ మార్కెటింగ్ లో దాదాపు 7 లక్షల మంది సభ్యులు చేరినట్టు వారిని నుంచి ఏకంగా 1000 కోట్ల వసూలు చేసినట్టు అధికారులు తెలిపారు.

అమాయకులైన యువతను ఆకట్టుకోవడనికి ఇదొక కోర్స్ మార్కెటింగ్ అని చెప్పి మొదట 16 వేల రూపాయలు కట్టి సభ్యతం చేసుకొని సభ్యులు గా చేర్పించుకుంటారు. ఈ సంస్థ లో చేరిన మొదట ఆ వ్యక్తికి పదివేల ఫైట్స్ ఇస్తారు. ఇలా చేరిన వారికీ కమిషన్ రావాలంటే మరో ముగురు ని చేర్పిస్తే కమిషన్ వస్తుందని చెప్పారు. ఇలా చేరిన సభ్యులకు  కంప్యూటరు తో పాటు మరి 58 రకాల కోర్సులు నేర్పించి ట్రేనింగ్ ఇస్తామని నమ్మించి కోర్స్ కంప్లైట్ అయ్యాక 50% మార్కులు తెచ్చుకుంటే సర్టిఫికేట్ ఇస్తారు. ఆదిలాబాద్, వరంగల్‌లోనూ ఈ సంస్థ పైన కేసులు దాఖలయ్యాయి. ఈ సంస్థ నుంచి మోసపోయిన వారు కొందరు వస్తున్నారని సజ్జనార్ తెలిపాడు.