ధోని ప్రవర్తనపై పెరుగుతున్న వ్యతిరేకత : ధోని నిజంగా తప్పు చేశాడా ?

0
148
ధోని ప్రవర్తనపై పెరుగుతున్న వ్యతిరేకత : ధోని నిజంగా తప్పు చేశాడా ?
ధోని ప్రవర్తనపై పెరుగుతున్న వ్యతిరేకత : ధోని నిజంగా తప్పు చేశాడా ?

ఇండియా మాజీ కెప్టన్, ప్రస్తుత IPL చెన్నై సూపర్ కింగ్స్ కెప్టన్ అయిన ధోనికి ఉన్న ఫాలోయింగే వేరు. మన భారతదేశంలోనే వరల్డ్ వైడ్ గా అతడికి ఫాన్స్ ఉన్నారు. అందుకు ప్రధాన కారణం ధోని ఆటా తీరుతోపాటు, ఆయన ప్రవర్తన ప్రతి ఒక్కరినీ ఆకశిస్తుంది. గొడవలకు చాలా దూరంగా ఉండే ధోని, ప్రతి ఆటగాడితో స్నేహపూర్వకంగా ఉంటాడు. పైగా ధోని మైదానంలో ఉన్నప్పుడూ అంపైర్ కు ఏదైనా అప్పీల్ చేశాడు అంటే అది 100 శాతం నిజం అయ్యి తీరుతుంది.

అదే ధోని అప్పీల్ చేయకుండా సైలెంట్ గా ఉన్నాడు అంటే అది నాటౌట్ ఫిక్స్ అయిపోవాలి. ఆట విషయంలో అంతా షార్ప్ గా ఉంటాడు ధోని. అందుకే ఆయనంటే ప్రతి ఒక్కరికీ అభిమానం అలాంటి ధోనిపై ఇప్పుడు వ్యతిరేకత పెరుగుతుంది. అందుకు ప్రధాన కారణం నిన్న రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌ సందర్భంగా ధోని ప్రవర్తన. డగౌట్‌ లో ఉన్న ధోని మైదానంలోకి ప్రవేశించి అంపైర్లతో వాగ్వాదానికి దిగిన విషయం తెలిసిందే.

ధోని చర్యను ఐపీఎల్‌ ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన రెండో స్థాయి నేరంగా పరిగణిస్తూ జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకుంది. క్రీడా స్ఫూర్తిని దెబ్బతీసినందుకు గానూ IPL యాజమాన్యం ఆర్టికల్‌ 2.20 ప్రకారం శిక్షలు విధిస్తుంది. అందులో బాగంగా చెన్నై కెప్టన్ ధోనికి మ్యాచ్‌ ఫీజులో 50శాతం కోత పడింది. దీనియాపై సీనియర్ క్రికెటర్స్ అందరూ సైలెంట్ గానే ఉన్నా కొందరు మాత్రం “ధోని”ని విమర్శిస్తున్నారు.

అందులో బాగంగానే “మైదానంలో అంపైర్లతో దురుసుగా ప్రవర్తించిన తీరుకు ధోనికి పడిన శిక్ష చాలా చిన్నది” అని మాజీ క్రికెటర్‌ “సంజయ్‌ మంజ్రేకర్‌” అభ్రిపాయపడ్డారు. ప్రవర్తన నియమావళి ఉల్లంఘన కింద ధోనీకి మ్యాచ్‌ ఫీజులో 50శాతం కోత విధిస్తూ IPL తీసుకున్న నిర్ణయం.. ధోనికి చాలా చిన్నశిక్ష.. నిజానికి ఆయన తన హద్దులు దాటి ప్రవర్తించాడని “సంజయ్‌ మంజ్రేకర్‌” పేర్కొన్నాడు. చివరగా మాత్రం “కాకపోతే అన్ని సందర్భాల్లోనూ అదృష్టం ధోని వెంటే ఉంటోంది” అంటూ ట్విటర్‌ వేదికగా తన అభిప్రాయాన్ని పోస్టు చేశాడు.