ఎంపీ యూనిట్ ఓకే.. ఎమ్మెల్యే యూనిట్ ఈజ్ నాట్ వ‌ర్కింగ్‌..!

0
89

తెలుగుదేశం పార్టీని ఓడించేందుకు కుట్రలు జ‌రుగుతున్నాయ‌ని ఆ పార్టీకి చెందిన తాడికొండ ఎమ్మెల్యే శ్ర‌వ‌ణ్ కుమార్ ఆరోపించారు. టీడీపీకి ఆధిక్యం ఉన్న 39 పోలింగ్ బూత్‌ల‌లో ఈవీఎంలు మొరాయిస్తున్నార‌ని ఆయ‌న ఆరోపించారు. తాడికొండ నియోజ‌క‌వ‌ర్గంలో రీ పోలింగ్ నిర్వ‌హించాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.

కాగా, సార్వ‌త్రిక ఎన్నిక‌ల సంద‌ర్భంగా తాడికొండలోని పోలింగ్ బూత్‌ల‌ను ప‌రిశీలించిన అనంత‌రం శ్ర‌వ‌ణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. త‌న నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో ఈవీఎంలు మొరాయిస్తున్నాయ‌ని ఎన్నిక‌ల సంఘానికి ఈ రోజు ఉద‌యం నుంచి ఫిర్యాదు చేస్తున్న‌ప్ప‌టికీ ఎటువంటి స్పంద‌న లేద‌న్నారు. తాడికొండ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని బూత్ నెం.56 ఎంపీ ఓటు ఈవీఎం పని చేస్తుంద‌ని, ఎమ్మెల్యే ఓటు మిష‌న్ ప‌నిచేయ‌డం లేద‌ని, దీంతో ఓటింగ్‌ను స్టాప్ చేయాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు