2 ఏళ్ల కొడుకుకు విషమిచ్చి ప్రాణం తీసిన తల్లి..?

0
146

నేటి ఆధునిక యుగంలో తల్లిప్రేమ కూడా విషయం అయ్యిందని ఈమద్య అనేక సంఘటనలు నిరూపించాయి. కంటికి రెప్పలా కాపాడే తల్లే హంతకురాలు అయితే ? అలాంటి వారిని ఏం చేయాలి. వివాహేతర సంబందానికి అడ్డుగా ఉన్నాడని కన్న కొడుకునే చంపేసిందనే అనుమానంతో ఓ మహిళాను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు పోలీసులు.

వివరాల్లోకి వెళ్తే.. వేలూరు వానియంబాడి సమీపంలోని అగరతాండవన్ గ్రామానికి చెందిన సత్య (21) తిరుపత్తూరులోని ఓ ప్రవేటు నర్సింగ్ హోమ్ లో నర్సుగా పనిచేస్తుంది. ఈమెకు తొట్టిగనర్ కు చెందిన శరవణన్ తో 3 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. ఈ దంపతులకు రోషన్ అనే రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. గత ఏడాది నుండి భార్య భర్తల మద్య ఘర్షణ ఏర్పడడంతో కొంత దూరంగా ఉన్నారు.

సత్య కొడుకుతో కలిసి అమ్మగారింట్లో ఉంటే శరవణన్ మాత్రం విదేశాల్లో పనిచేస్తున్నట్లు సమాచారం.. ఇలాంటి సమయంలో బుధవారం మధ్యాహ్నం మంచంపై పడిఉన్న చిన్నారి రోషన్ నోటినుండి నూరగ రావడంతో పాటు, మొహంపై దిండు పెట్టి అదిమినట్లు గుర్తులు ఉండడంతో బంధువులు కేకలు వేశారు.

అది గమనించిన తల్లి సత్య కూడా నా కొడుకు చనిపోయాడు అంటూ కేకలు వేసి కన్నీళ్లు పెట్టుకుంది.. పైగా నిజా నిజాలు తేలకుండానే, నిద్రిస్తున్న సమయంలో మొహంపై తల దిండు పెట్టడం వల్లే చనిపోయాడు అంటూ ఏడ్వడం మొదలు పెట్టింది. దాంతో అనుమానం వచ్చిన గ్రామస్తులు మొహంపై దిండు పెడితే చనిపోవడం ఏంటని.. సత్యే తన కొడుకును చంపేసి ఉంటుందని దిమ్మామ్ పేట పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారించగా, విచారణలో సత్యకు అదే ప్రాంతానికి చెందిన ఒక యువకుడితో వివాహేతర సంబందం ఉందని.. భర్త విదేశాల్లో ఉండడంతో చాలా రోజులుగా అతడితోనే రహస్య జీవితం కొనసాగిస్తుందని, ఆ రహస్య జీవితానికి అడ్డుగా ఉన్న కొడుకు రోషన్ ని హత్యచేసి ఉంటుందని అనుమానాలు వస్తున్నాయి. దాంతో నిజానిజాలు తేల్చే పనిలో పడ్డారు దిమ్మామ్ పేట పోలీసులు.