క‌ల్తీలేని అమ్మ‌ప్రేమ‌కు నిద‌ర్శ‌నం ఇదే..! (వీడియో)

0
161

మీలా ఉండేందుకు ఇల్లు లేదు.. ఎండకి ఎండుతూ.. వానకి తడుస్తూనే మేం పెట్టిన గుడ్లను కాపాడుంటాం. అలానే వాటిని పొదుగుతాం. మా గుడ్లు పిగిలి పిల్ల‌లు బ‌య‌ట‌కొచ్చి.. రెక్కలు విచ్చుతూ ఎగిరిపోయేంత వరకు.. మా పిల్ల‌ల‌ను పొత్తిళ్లలోనే పొదువుకుంటాం. అంత‌లా క‌ష్ట‌ప‌డుతూ కాపాడుకుంటూ వచ్చిన గుడ్లని మీ ట్రాక్టర్‌తో తొక్కి చిదిమేస్తానంటే నేనెలా ఊరుకుంటా..? నా ప్రాణాల‌ను ప‌ణంగాపెట్టైనా స‌రే నా బిడ్డలను కాపాడుకుంటా. దయ చేసి కనికరించండి.. ఇటు రాకండి.. ఇదంతా ఆ చిన్ని పక్షి తన గుడ్లను కాపాడుకోవడానికి ఎదురుగా వస్తున్న ట్రాక్టర్‌‌ను అడ్డుకునేందుకు చేస్తున్న ప్రయత్నం.

చైనా ఎలాంకాబ ప్రాంతంలోని ఓ పొలంలో ఇటువంటి సంఘ‌ట‌నే ఎదురైంది. గుడ్ల‌ను పొదిగుతున్న ఓ ప‌క్షి వాటిని జాగ్రత్తగా చూసుకుంటున్న క్ర‌మంలో గుడ్లను ఎవ‌రైనా ఏమైనా చేస్తారేమో..! అని కంటికి రెప్పలా కాపాడుకుంటోంది. ఈ నేప‌థ్యంలో అటుగా ఓ ట్రాక్టర్ రావడాన్ని చూసిన ఆ ప‌క్షి తన శక్తి మేరకు రెక్కల్ని చాచి.. అచ్చంగా మనుషుల్లానే ఇటువైపుకి రాకండి.. అక్క‌డ నా పిల్ల‌లు ఉన్నారు.. ద‌య‌చేసి ట్రాక్ట‌ర్‌ను అటుగా తిప్పండి అంటూ త‌న భాష‌లో చెబుతున్న ఈ అపురూప దృశ్యం చూసేందుకు ఎంతో ఆస‌క్తిగా ఉంది. ఆ దృశ్యం ట్రాక్టర్ నడిపే వ్యక్తిని ఆకర్షించడంతో వీడియోలో బంధించి పోస్ట్ చేశాడు. ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్స్ ప్రశంసలు పొందుతోంది.