నటి సంగీత పై తల్లి భానుమతి ఫిర్యాదు ..!

0
177
mother bhanumathi complaint against actress sangeetha

నటి సంగీత మీద తల్లి ఫిర్యాదు చేసింది. తనను ఇంట్లో నుండి వెళ్లిపొమ్మని కన్న కూతురే బెదిరిస్తుందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాల్లోకెళ్తే.. నటి సంగీత తల్లి భానుమతి. ఈమె ప్రస్తుతం.. తమిళనాడు రాష్ట్రం చెన్నై జిల్లా వలసరవాక్కంలో మామగారి నుంచి ఆస్తిగా వచ్చిన ఇంటిలో నివాసముంటున్నారు. ఇంటిలో క్రింది పోర్షన్ లో భానుమతి, పై పోర్షన్ లో నటి సంగీత, ఆమె భర్త క్రిష్ నివసిస్తున్నారు. ఈ ఇల్లు నటి సంగీత పేరు మీద ఉంది. తల్లి భానుమతి పై ఇంటిని వదిలి వెళ్లిపొమ్మని ఒత్తిడి చేయడంతో, భానుమతి తమిళనాడు మహిళా కమిషన్‌కు కంప్లైంట్ ఇచ్చారు.

భానుమతి ఫిర్యాదులో ‘సంగీతకు ఇద్దరు సోదరులు అందులో ఒకరు ఈ మధ్యే మరణించారు. తల్లిని అడ్డుపెట్టుకొని మరో సోదరుడు ఇంటిని అపహరిస్తాడని సంగీత భావించి, ఇంటిని వదిలి వెళ్లిపోవాల్సిందిగా  ఒత్తిడి చేస్తూ, బెదిరిస్తుందని తెలిపింది. అవసాన దశలో ఉన్న తాను ఎక్కడికి వెళ్లాలంటూ.. ఇల్లు విడచి వెళ్ళలేనని ఆవేదనను’ వ్యక్తపరిచింది. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు నటి సంగీతకు నోటీసులు పంపారు. దీనితో నటి సంగీత, ఆమె భర్త క్రిష్ పోలీస్ కమిషన్ ఎదుట మూడురోజుల క్రిందట హాజరయ్యారు. ఈ తరువాత జరిగిన వ్యవహారం మీదుగా మీడియా ప్రశ్నించగా, నా వ్యక్తిగత విషయాలు గూర్చి మాట్లాడను. కావాలంటే సినిమాల పై ఏదైనా అడగండి అంటూ నటి సంగీత తప్పించుకోవడమే కాకుండా.. ఘాటైన సమాధానం ఇచ్చింది.