పెళ్ల‌య్యాక కూడా రెండోసారి ప్రియుడితో వెళ్లింద‌ని..!

0
136

క‌న్న తండ్రే సొంత కూతుర్ని గొంతు నులిమి హ‌త్య‌చేసిన ఘ‌ట‌న యాదాద్రి భువ‌న‌గిరి జిల్లా చౌటుప్ప‌ల్ మండ‌లంలో చోటు చేసుకుంది. పంతంగి గ్రామానికి చెందిన చుక్కా యాదయ్య రెండో కుమార్తె స్నేహా అంజ‌లికి అబ్దుల్‌పూర్‌మెట్‌కు చెందిన కిరికి న‌రేష్‌తో జూన్ 14న వివాహం చేశారు. స్నేహాంజ‌లి వివాహం జ‌రిగిన మూడు రోజుల‌కే త‌న గ్రామానికి చెందిన ప్రియుడు బోయ శేఖ‌ర్‌తో వెళ్లిపోయింది.

స్నేహాంజ‌లి త‌ల్లిదండ్రుల పిర్యాదు మేర‌కు ప్రియుడు శేఖ‌ర్‌పై పోలీసులు కేసు న‌మోదు చేశారు. అమ్మాయిని మంద‌లించి మ‌ళ్లీ అత్త‌గారింటికి పంపించారు. అయితే త‌న త‌ల్లిదండ్రుల మాట‌ను ఖాత‌రు చేయ‌ని స్నేహాంజ‌లి మ‌రోసారి త‌న ప్రియుడితో వెళ్లిపోయింది.

మ‌రోసారి తండ్రి యాద‌య్య త‌న కూతురిని ప్రియుడు శేఖ‌ర్ నుంచి పంతంగి గ్రామానికి తీసుకొస్తూ జిల్లేడు చెల‌క‌వ‌ద్ద గొంతునులిమి చంపేందుకు ప్ర‌తయ‌త్నించాడు. ఆఖ‌రి నిమిషంలో తండ్రి ప్రేమ అడ్డురావ‌డంతో వ‌దిలేశాడు. విష‌యం తెలుసుకున్న పోలీసులు స్నేహాంజ‌లిని చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అయితే పోలీసులు యాద‌య్య‌పై హ‌త్యాయ‌త్నం కేసు న‌మోదు చేయ‌డం గ‌మ‌నార్హం.