మోడీ.. నీవు ఎల్ల‌కాలం ప్ర‌ధానివి కాదు..!

0
194

న‌రేంద్ర మోడీ.. నీవు ఎల్ల‌కాలం ప్ర‌ధానివి కావు గుర్తుపెట్టుకో అంటూ టీడీపీ ఎంపీలు మండిప‌డ్డారు. కాగా, విభ‌జ‌న హ‌క్కుల అమ‌ల్లో కేంద్ర ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న తీరును పార్ల‌మెంట్ సాక్షిగా ఏపీ టీడీపీ ఎంపీలు తీవ్రంగా ఖండించారు. ఏపీకి ప్ర‌త్యేక హోదాతోపాటు మోడీ ఇచ్చిన హామీల‌ను కూడా అమ‌లు చేయాల‌ని డిమాండ్ చేశారు. మోడీ ప్ర‌భుత్వంపై నిప్పులు చెరిగారు. అంతేకాకుండా మోడీ ప్ర‌భుత్వాన్ని గ‌ద్దెదింపైనా స‌రే విభ‌జ‌న హక్కుల‌ను సాధించుకుంటామ‌ని టీడీపీ ఎంపీలు స్ప‌ష్టం చేశారు.

సుజ‌నా చౌద‌రి, టీడీపీ ఎంపీ : కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌ట్నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు దేశానికి ఉప‌యోగ‌ప‌డే విధంగా ఒక్క‌టంటే.. ఒక్క మంచి ప‌ని కూడా చేయ‌లేదు.

రామ్మోహ‌న్ నాయుడు, టీడీపీ ఎంపీ : ప‌్ర‌ధాని మోడీ ఏద‌డిగానా స‌రే తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ అంగీక‌రిస్తున్నారు. వారిద్ద‌రూ రాజ‌కీయంగా సపోర్టు చేసుకుంటున్నారు. కేసీఆర్ విభ‌జ‌న హామీల సాధ‌న‌ను ప‌క్క‌న‌పెట్టి రాజ‌కీయ ఎదుగుద‌ల కోసం ఆరాట‌ప‌డుతున్నారు. ఆ క్ర‌మంలోనే ఏపీకి తీవ్ర న‌ష్టం జ‌రుగుతుంది.