క‌న్నెర్ర‌జేసిన ఎమ్మెల్యే రోజా..!

0
77

గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో జ‌రిగిన కాల్‌మ‌నీ సెక్స్‌రాకెట్ వ్య‌వ‌హారంతో సంబంధం ఉన్న టీడీపీ ఎమ్మెల్యేల‌ను, ఎమ్మెల్సీల‌ను కాపాడుకునేందుకు అసెంబ్లీ స‌మావేశాల్లో వాయిదా తీర్మాణం ఇచ్చిన త‌న నోరు నొక్కేందుకు సంవ‌త్స‌రంపాటు చంద్ర‌బాబు సస్పెండ్ చేయ‌డం ఎంత వ‌ర‌కు స‌మంజ‌స‌మ‌ని న‌గ‌రి ఎమ్మెల్యే ఆర్‌కే రోజా ప్ర‌శ్నించారు.

కాగా, ఈ రోజు జ‌రిగిన ఏపీ అసెంబ్లీ స‌మావేశాల్లో రోజా మాట్లాడుతూ త‌న‌ను అక్ర‌మంగా స‌స్పెండ్ చేశార‌ని, ఆ విష‌యాన్ని సుప్రీం కోర్టు దృష్టికి తీసుకెళ్లి ఇంట్రీమ్ ఆర్డ‌ర్‌తో వ‌స్తే క‌నీసం న్యాయ స్థానాన్ని కూడా గౌర‌వించ‌కుండా మార్ష‌ల్స్‌తో త‌న‌ను అసెంబ్లీ నుంచి బ‌య‌ట‌కు పంపించిన టీడీపీ నేత‌లు స‌భా సాంప్ర‌దాయాల గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వ‌ల్లించిన‌ట్లు ఉన్నాయ‌న్నారు.