ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు రాజీనామా..!

0
745

టీఎంయూ గౌర‌వ అధ్య‌క్ష ప‌ద‌వికి సిద్దిపేట టీఆర్ఎస్‌ ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు రాజీనామా చేశారు. త‌న రాజీనామా లేఖ‌ను టీఎంయూ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి య‌శ్వ‌ద్ధామ‌రెడ్డికి పంపించారు. అధికారిక కార్య‌క్ర‌మాల‌కు ఎక్కువ స‌మ‌యం కేటాయించాల్సి ఉండ‌టం వ‌ల్ల ఆర్టీసీ కార్మిక సంఘం కార్య‌క్ర‌మాల్లో భాగ‌స్వామ్యం సాధ్య‌ప‌డ‌టం లేద‌ని లేఖ‌లో పేర్కొన్నారు. కార్మికుల సంక్షేమానికి నిరంత‌రం త‌న సహ‌కారం ఉంటుంద‌ని హ‌రీశ్‌రావు స్ప‌ష్టం చేశారు. హ‌ఠాత్తుగా హ‌రీశ్‌రావు టీఎంయూకు రాజీనామా చేయ‌డం రాజ‌కీయాల్లో చ‌ర్చ‌నీయాంశ‌మైంది.