తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీకి మరో షాక్‌ : TRSలోకి మరో ఎమ్మెల్యే

0
338
MLA Haripriya Naik Will Joins in TRS Party
MLA Haripriya Naik Will Joins in TRS Party

నిన్న తెలంగాణ రాష్ట్రనికి “రాహుల్ గాంధీ” గారు వచ్చి వెళ్లరోలేదో ఈరోజు కాంగ్రెస్‌ పార్టీకి మరో షాక్‌ తగిలింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు MLA “హరిప్రియా నాయక్‌” కూడా TRSలో చేరనున్నారు. “కాంగ్రెస్‌ కు రాజీనామా చేసి TRS బీ ఫామ్‌పై పోటీకి నేను సిద్దం” అని హరిప్రియ ప్రకటించారు. ఇల్లెందు నియోజకవర్గం అభివృద్ధికి CM కేసీఆర్‌ బాటలో పయనించాలని నిర్ణయించుకున్నానని ఆమె వెల్లడించారు.

అలాగే ముఖ్యమంత్రి KCR గారి సారథ్యంలో “బంగారు తెలంగాణ” నిర్మాణంలో తాను కూడా భాగస్వామ్యం అవుతానని “హరిప్రియా నాయక్‌” చెప్పారు. ఇక తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీకే చెందిన నకిరేకల్‌ MLA “చిరుమర్తి లింగయ్య” కూడా TRSలో చేరనున్నట్లు శనివారం ప్రకటించిన విషయం తెలిసిందే. తన నియోజకవర్గంతో పాటు నల్గొండ ఉమ్మడి జిల్లా అభివృద్ధి కోసం KCR నాయకత్వంలో పనిచేయాలనే ఈ నిర్ణయం తీసుకున్నానని “చిరుమర్తి లింగయ్య” చెప్పారు.