ఎమ్మెల్యే బాల‌కృష్ణ : మా కార్య‌క‌ర్త‌ల జోలికొస్తే..!

0
90

తాడిప‌త్రి మండలం వీరాపురం గ్రామానికి చెందిన టీడీపీ నాయ‌కులు చింతా భాస్క‌ర్‌రెడ్డి మృతి త‌న‌ను బాధించింద‌ని హిందూపురం ఎమ్మెల్యే బాల‌కృష్ణ అన్నారు. కాగా, ఇటీవ‌ల జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల పోలింగ్ సంద‌ర్భంగా వైసీపీ, టీడీపీ శ్రేణుల మ‌ధ్య చోటు చేసుకున్న ఘ‌ర్ష‌ణ నేప‌థ్యంలో చింతా భాస్క‌ర్ అక్క‌డిక‌క్క‌డే మృతి చెందిన సంగ‌తి తెలిసిందే. దీంతో మృతుని కుటుంబ స‌భ్యుల‌ను మాజీ సీఎం చంద్ర‌బాబు, బాల‌కృష్ణ‌, టీడీపీ ముఖ్య‌నేత‌లు ప‌ర‌మార్శించారు.

ఈ సంద‌ర్భంగా బాల‌కృష్ణ మీడియాతో మాట్లాడుతూ టీడీపీ ఎప్పుడు అధికారంలోకి వ‌చ్చినా ఎటువంటి అల్ల‌ర్లు జ‌రిగేవి కాద‌ని, కాంగ్రెస్ హ‌యాంలో మ‌ళ్లీ హ‌త్యా రాజకీయ ఘ‌ట‌న‌లు చోటుచేసుకున్నాయ‌న్నారు. అధికార పార్టీ, వైసీపీపై, సీఎం జ‌గ‌న్‌పై బాల‌కృష్ణ ఇంకా ఏమేం మాట్లాడారో ఈ వీడియోలో..