అనీల్ కుమార్ యాద‌వ్ : ప‌్ర‌మాణ‌స్వీకార వేదిక‌పై ఆస‌క్తిక‌ర ఘ‌ట‌న‌..!

0
1670

నెల్లూరు ప‌ట్ట‌ణ నియోజ‌క‌వ‌ర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ టికెట్‌పై రెండోసారి శాస‌న స‌భ‌కు ఎన్నికైన అనీల్ కుమార్ యాద‌వ్ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి కేబినేట్‌లో మంత్రిగా కాసేటి క్రితమే ప్ర‌మాణ స్వీకారం చేశారు. అమ‌రావ‌తి వేదిక‌గా జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో మొద‌ట‌గా తెలుగు రాష్ట్రాల గ‌వ‌ర్న‌ర్ ఈఎస్ఎల్ న‌ర‌సింహం అనీల్ కుమార్ పోలుబోయిన అని పిల‌వ‌గానే ప్ర‌మాణ స్వీకార కార్య‌క్ర‌మ ప్రాంగ‌ణ‌మంతా క‌ర‌తాల ధ్వ‌నుల‌తో మారుమోగిపోయింది. మినిస్ట‌ర్ అనీల్ కుమార్ అనే నినాదాల‌తో హోరెత్తింది.

గ‌వ‌ర్న‌ర్ పిలుపు మేర‌కు స‌భావేదిక‌పైకి చేరుకున్న అనీల్ కుమార్ యాద‌వ్ చేత గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేశారు. మొద‌ట‌గా అనీల్ కుమార్ పోలుబోయిన అనే నేను అంటూ మొద‌లు పెట్టిన ఆయ‌న శాస‌నం ద్వారా నిర్మిత‌మైన భార‌త రాజ్యాంగంప‌ట్ల నిజ‌మైన విశ్వాసం. విధేయ‌త చూపుతాన‌ని, భార‌త‌దేశ సార్వ‌భౌమాధికారాన్ని, స‌మ‌గ్ర‌త‌ను కాపాడుతాన‌ని, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర మంత్రిగా నా క‌ర్త‌వ్యాల‌ను, శ్ర‌ద్ధ‌తో అంత‌క‌ర‌ణశుద్ధితో నిర్వ‌హిస్తాన‌ని, భ‌యం కానీ, ప‌క్షపాతంకానీ, రాగ‌ద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాస‌నాల‌ను అనుస‌రించి ప్ర‌జ‌లంద‌రికీ న్యాయం చేకూరుస్తానిన దైవ సాక్షిగా ప్ర‌మాణం చేస్తున్నాను అంటూ అనీల్ కుమార్ యాద‌వ్ మంత్రిగా తన ప్ర‌మాణ స్వీకారాన్ని ముగించారు.