80 ఏళ్ల వృద్దురాలిపై 15 ఏళ్ల బాలుడు అత్యాచారం..!

0
191

80 ఏళ్ల వృద్ధురాలిపై 15 ఏళ్ల బాలుడు అత్యాచారానికి ఒడిగ‌ట్టాడు. ఈ సంఘ‌ట‌న బీహార్ మ‌ధుబ‌ని జిల్లా ప‌రిధిలోగ‌ల జ‌మైలా గ్రామంలో చోటు చేసుకుంది. ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చిన ఈ సంఘ‌ట‌న‌కు సంబంధించి మ‌రిన్ని వివ‌రాలు ఇలా ఉన్నాయి. జ‌మైలా గ్రామంలో నివాసం ఉంటున్న బాధితురాలు వృద్ధురాలు బుధ‌వారం రాత్రి నిద్రిస్తున్న స‌మ‌యంలో త‌న ద‌గ్గ‌రి బంధువైన 15 ఏళ్ల బాలుడు ఇంట్లోకి చొర‌బ‌డి అత్యాచారానికి య‌త్నించాడు.

బాలుడి చ‌ర్య‌ను గ‌మ‌నించిన ఆ వృద్ధురాలు ప్ర‌తిఘ‌టించేందుకు య‌త్నించిన‌ప్ప‌టికీ నోట్లో గుడ్డ‌లు కుక్క‌డంతో ఆమె ప్ర‌య‌త్నం విఫ‌ల‌మైంది. బాలుడి నుంచి ర‌క్షించుకునేందుకు చేసిన ప్ర‌య‌త్నాల‌న్నీ కూడా విఫ‌లంగానే మిగిలిపోయాయి. అత్యాచారం అనంత‌రం ఆ బాలుడు ఇంట్లో నుంచి పారిపోతుండ‌గా బాధితురాలైన వృద్ధురాలు గ‌ట్టిగా కేక‌లు వేసింది. దీంతో మేల్కొన్న కుటుంబ స‌భ్యులు, స్థానికులు బాలుడ్ని ప‌ట్టుకుని దేహ‌శుద్ధి చేశారు. స‌మాచారం తెలుసుకున్న పోలీసులు బాలుడ్ని అదుపులోకి తీసుకున్నారు.

వృద్ధురాలి కుటుంబ స‌భ్యులు, స్థానికుల దాడిలో తీవ్రంగా గాయ‌ప‌డిన బాలుడ్ని, బాధితురాలు వృద్ధురాలిని చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. బాధురాలి కోడ‌లు ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేశారు. అయితే బాలుడు మైన‌ర్ కాద‌న్న కార‌ణాన్ని చూపి కేసును నీరుగార్చే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ని బాధితురాలి కుటుంబ స‌భ్యులు ఆరోపిస్తున్నారు. నిందితుడు ప్ర‌స్తుతం జ్యుడిషియ‌ల్ క‌స్ట‌డీలో ఉన్న‌ట్టు పోలీసులు తెలిపారు.