మంత్రి వ‌నిత : టీడీపీ నేతలు ఫోన్‌చేసి వ‌చ్చేయ్య‌మ‌న్నారు.. సంచ‌ల‌న నిర్ణ‌యం..!

0
1406

ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి మ‌హిళ‌ల‌కు ప్రాధాన్య‌తగ‌ల మ‌హిళా శిశుసంక్షేమ‌శాఖ‌ను త‌న‌కు కేటాయించినందుకు చాలా సంతోషంగా ఉంద‌ని మంత్రి తేనేటి వ‌నిత అన్నారు. కాగా త‌న‌ను ప‌ల‌క‌రించిన ఓ ప్ర‌ముఖ మీడియా ఛానెల్‌తో మంత్రి మాట్లాడారు. గ‌తంలో తాను టీడీపీని వీడి వైసీపీలో చేరిన స‌మ‌యంలో త‌న‌కు ఎదురైన స‌మ‌స్య‌ల‌ను వెల్ల‌డించారు.

తాను వైసీపీలో చేరిన స‌మ‌యంలో టీడీపీ నేత‌లు త‌నను తీవ్ర‌వాదిని చూసిన‌ట్టు చూసేవార‌ని, అటువంటి ఇబ్బందులు ఎన్ని ఎదుర‌వుతున్నా తాను వైసీపీలో కొన‌సాగాన‌ని, త‌న రాజ‌కీయ జీవితం మొత్తం వైసీపీలోనే ఉండేలా తాను నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలిపారు.

2014 సాధార‌ణ ఎన్నిక‌ల్లో వైసీపీ ఓడిన స‌మ‌యంలో కొంద‌రు టీడీపీ నేత‌లు ఫోన్‌లు చేసి ప్ర‌స్తుతం అధికారంలో ఉన్నాం.. పార్టీలోకి వ‌చ్చేయొచ్చు క‌దా..!, కావాలంటే చంద్ర‌బాబుతో మాట్లాడుతామంటూ భ‌రోసా ఇచ్చేలా మాట్లాడార‌న్నారు. టీడీపీలోనే ఉంటే నీవు బెంజ్ కారులో తిరిగేదానివి.. అంటూ త‌న‌పై ఒత్తిడి తీసుకొచ్చిన విష‌యాల‌ను మంత్రి వ‌నిత మీడియాకు వెల్ల‌డించారు.

అలా నాడు టీడీపీ నేత‌లు అన్న మాట‌ల‌కు పౌరుషం పెంచుకుని గ‌త ఐదు సంవ‌త్స‌రాల‌పాటు ప్ర‌జ‌ల‌తో క‌లిసి ప‌నిచేశాని మంత్రి వ‌నిత తెలిపారు. నియోజ‌క‌వ‌ర్గంలోని ప్ర‌తి ఒక్క కార్య‌క‌ర్త‌ను స‌మ‌న్వ‌యం చేసుకుంటూ ప‌నిచేసినందునే త‌న‌కు ఈ ద‌ఫా జ‌రిగిన ఎన్నిక‌ల్లో అత్య‌ధిక మెజార్టీ ల‌భించింద‌ని ఆమె తెలిపారు.