మంత్రి మ‌ల్లారెడ్డికి చిర్రెత్తుకొచ్చింది..!

0
87

మంత్రి మ‌ల్లారెడ్డికి సొంత జిల్లాలోనే చేదు అనుభ‌వం ఎదురైంది. కాగా, మేడ్చ‌ల్ జిల్లా బోడుప్ప‌ల్‌లో టీఆర్ఎస్ పార్టీ స‌భ్య‌త్వ న‌మోదు కార్య‌క్ర‌మంలో ఆయన పాల్గొన్న స‌మ‌యంలో ఈ సంఘ‌ట‌న చోటు చేసుకుంది. ఒక్క‌సారిగా పార్టీలోని ఇరువ‌ర్గాల మ‌ధ్య విబేధాలు భ‌గ్గుమ‌న్నాయి.

మంత్రి మ‌ల్లారెడ్డి స‌భ‌లోనే ఉన్నార‌న్న విష‌యాన్ని మ‌రిచి మ‌రీ ఇరువ‌ర్గాలు మాట‌ల యుద్ధానికి దిగారు. మ‌ల్లారెడ్డి చెప్పే ప్ర‌య‌త్నం చేసినా వారు వినిపించుకోక‌పోవ‌డం గ‌మ‌నార్హం. పార్టీ స‌భ్యుల తీరుతో చిర్రెత్తుకొచ్చిన మ‌ల్లారెడ్డి పార్టీ స‌భ్య‌త్వ న‌మోదు కార్య‌క్ర‌మం నుంచి వెనుదిరిగారు.