బిగ్ బ్రేకింగ్ : మంత్రి క‌న్న‌బాబు సంచ‌ల‌న నిర్ణ‌యం..!

0
412

ఏపీ వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి క‌న్న‌బాబు సంచ‌ల‌న నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించారు. కాగా, పంట‌సాగు స‌మ‌యంలో రాష్ట్రంలోని రైతులంద‌రికి ఆర్థిక‌సాయంగా ఒక్కొక్క‌రికి కింద రూ.12,500లు అంద‌జేస్తామ‌ని పాద‌యాత్ర స‌మ‌యంలో వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి రైతు భ‌రోసా ప‌థ‌కం ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. వీలైనంత త్వ‌ర‌గా ఆ ప‌థ‌కాన్ని అమ‌లు చేసేందుకు ప్ర‌భుత్వం చ‌ర్య‌ల‌ను ముమ్మ‌రం చేసింద‌ని మంత్రి క‌న్న‌బాబు తెలిపారు.

సీఎం జ‌గ‌న్ ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్ట‌నున్న ఈ ప‌థ‌కాన్ని కేవ‌లం రైతుల‌కే కాకుండా, రాష్ట్రంలోని 15 ల‌క్ష‌ల మంది కౌలు రైతులంద‌రికీ వ‌ర్తించేలా ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంద‌ని మంత్రి క‌న్న‌బాబు వెల్ల‌డించారు. గ‌త చంద్ర‌బాబు ప్ర‌భుత్వం రుణ‌మాఫీ పేరుతో రైతులను నిలువెల్లా మోసం చేసింద‌ని, క‌నీసం ఇన్‌పుట్ స‌బ్సిడీ కూడా ఇవ్వ‌లేద‌ని, అన్ని విధాలా మోసం చేసిన టీడీపీ ప్ర‌భుత్వానికి ప్ర‌జ‌లే బుద్ధి చెప్పార‌ని క‌న్న‌బాబు అన్నారు.