మంత్రి అనీల్‌కుమార్ ఛాలెంజ్‌..!

0
185

ఏపీ నీటిపారుద‌ల‌శాఖ మంత్రి అనీల్ కుమార్‌యాద‌వ్ అసెంబ్లీ సాక్షిగా ప్ర‌తిప‌క్ష స‌భ్యుల‌కు స‌వాల్ విస‌ర‌డంతోపాటు.. రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు హామీ ఇచ్చారు. అయితే, ఆంధ్రా ప్ర‌జ‌ల 60 ఏళ్ల‌నాటి క‌ల అయిన పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మాణంపై ఈ రోజు అసెంబ్లీలో వాడీవేడీ చ‌ర్చ కొన‌సాగుతోంది. చ‌ర్చలో భాగంగా మంత్రి అనీల్ మాట్లాడుతూ 2018లో జ‌రిగిన అసెంబ్లీ స‌మావేశాల్లో మాజీ మంత్రి ఉమా మ‌హేశ్వ‌ర‌రావు ఇచ్చిన హామీని గుర్తు చేశారు.

2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల నాటికి పోల‌వ‌రం ప్రాజెక్టును పూర్తిచేస్తామ‌ని చెప్పిన ఉమా ప్ర‌జ‌ల‌ను మోసం చేశార‌ని, అందుకు టీడీపీ నేత‌లంతా రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను క్ష‌మాప‌ణ‌లు కోరాల‌ని డిమాండ్ చేశారు. కానీ ప్ర‌స్తుతం ఉన్న‌ వైసీపీ ప్ర‌భుత్వంలో రెండేళ్ల‌లో పోల‌వ‌రం ప్రాజెక్టును పూర్తిచేస్తామ‌ని మంత్రి అనీల్‌కుమార్ చెప్పారు. న‌వంబ‌ర్ నుంచి మొద‌లైతే స్పిల్‌వే, గేట్స్ పెట్టేందుకు స‌మ‌యం ప‌డుతుంద‌న్నారు. త‌రువాత ఫ్ల‌డ్ వ‌స్తుంద‌న్నారు. ల‌క్షా 50వేల కుటుంబాలను మార్చల‌న్న అంశం చాలా మేజ‌ర్ ఇష్యూ అని, దాన్ని తమ ప్ర‌భుత్వం ఛాలెంజ్‌గా తీసుకుంద‌న్నారు.