భూమా అఖిలప్రియ : వైఎస్ జ‌గ‌న్‌ను ఎప్పుడూ విమ‌ర్శించ‌లేదు..!

0
366

ఇక టీడీపీలో ఉండ‌టం త‌న‌వ‌ల్ల కాద‌న్న నిర్ణ‌యానికి మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ వ‌చ్చేసిన‌ట్టు సోష‌ల్ మీడియా కోడై కూస్తోన్న సంగ‌తి తెలిసిందే. అంతేకాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్‌లోకి రీ ఎంట్రీకి ఆ పార్టీ గౌర‌వ అధ్య‌క్షురాలు విజ‌య‌మ్మ సాయం తీసుకునేందుకు అఖిల‌ప్రియ సిద్ధ‌మ‌య్యార‌న్న వ‌దంతులు కూడా వైర‌ల్‌గా మారాయి. అయితే అఖిల‌ప్రియ కోరిన‌ట్టు వైసీపీలోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు విజ‌య‌మ్మ స‌హ‌క‌రిస్తారా..? లేదా..? అన్న చ‌ర్చ జిల్లా రాజ‌కీయాల్లో విస్తృతంగా జ‌రుగుతోంది.

నాడు దివంగ‌త ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డితోపాటు టీడీపీ తీర్ధం పుచ్చుకున్న అఖిల ప్రియ తాను ఏనాడు కూడా ప్ర‌తిప‌క్ష నేత‌గా ఉన్న వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డిని విమ‌ర్శించ‌లేదన్న విష‌యాల‌ను వైసీపీ ముఖ్య నేత‌ల వ‌ద్ద అఖిల ప్రియ ప్ర‌స్తావిస్తున్నార‌ట‌. తాను మంత్రిగా ఉన్న రోజుల్లో వైఎస్ జ‌గ‌న్‌ను తాను ఎప్పుడు కూడా టార్గెట్ చేయ‌లేద‌ని, పైగా టీడీపీ నేత‌ల‌తోనే తాను ఘ‌ర్ష‌ణ ప‌డుతూ వ‌చ్చిన విష‌యాల‌ను అఖిల ప్రియ గుర్తు చేస్తున్నార‌ట‌. మ‌రి విజ‌య‌మ్మ‌ను క‌లిసేందుకు అఖిల‌ప్రియ చేస్తున్న ప్ర‌య‌త్నాలు ఫ‌లిస్తాయా..? లేదా..? అన్నది తెలియాలంటే మ‌రికొన్ని రోజులు ఆగ‌క త‌ప్ప‌ద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు.