పార్టీ మార్పుపై మంత్రి అఖిల ప్రియ క్లారిటీ..!

0
171

ఏపీ మంత్రి భూమా అఖిల ప్రియ అతి త్వ‌ర‌లో జ‌న‌సేన‌లో చేర‌బోతోంది.. కాదు.. కాదు.. ఈ నెలలో ప‌లాన తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేర‌బోతోంది అంటూ గ‌త వారం రోజుల నుంచి ప్ర‌ముఖ న్యూస్ ఛానెళ్ల‌తోపాటు సోష‌ల్ మీడియా వెబ్ సైట్‌లో క‌థ‌నాలు వెలువ‌డిన సంగ‌తి తెలిసిందే. అయితే, ఆ క‌థ‌నాల‌న్నీ వ‌ట్టి పుకార్లేన‌ని మంత్రి అఖిల ప్రియ తేల్చేశారు.

కాగా, ఇవాళ మంత్రి అఖిల ప్రియ మీడియాతో మాట్లాడుతూ.. త‌న గొంతులో ప్రాణం ఉన్నంత వ‌ర‌కు తెలుగుదేశం పార్టీలోనే ఉంటూ చంద్ర‌బాబు నాయ‌క‌త్వంలో ప‌నిచేస్తాన‌ని స్ప‌ష్టం చేశారు. ప్ర‌తిప‌క్షాలు త‌న‌పై రాజ‌కీయ బుర‌ద జ‌ల్లేందుకు య‌త్నిస్తున్నాయ‌ని, వాట‌న్నిటిని ఎలా తిప్పికొట్టాలో త‌న‌కు తెల‌స‌న్నారు.

అంతేకాకుండా, క‌ర్నూలు జిల్లాలో వ్య‌వ‌సాయ సాగుకు నీరిచ్చి ప్ర‌జ‌ల‌ను ఆదుకున్న ఘ‌న‌త ఒక్క ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుకు మాత్ర‌మే ద‌క్కుతుంద‌న్నారు. అటువంటి సీఎం చంద్ర‌బాబుకు త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఆళ్ల‌గ‌డ్డ సీటును గెలిచి కానుక‌గా ఇస్తామ‌ని మంత్రి అఖిల ప్రియ చెప్పారు.