అర్ధ‌రాత్రి నారా లోకేష్ ధ‌ర్నా..!

0
209

ఏపీ ఎన్నిక‌ల్లో మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గం హాట్‌టాపిక్ అయింది. ఎన్నిక‌ల అధికారుల తీరును నిర‌సిస్తూ మంత్రి నారా లోకేష్ గురువార అర్ధ‌రాత్రి ధ‌ర్నాకు దిగారు. వైసీపీ శ్రేణులు సైతం నారా లోకేష్‌కు వ్య‌తిరేకంగా నిర‌స‌న‌కు దిగాయి. దీంతో మంగ‌ళ‌గిరిలో తీవ్ర ఉద్రిక్త‌త నెల‌కొంది. టీడీపీ, వైసీపీ శ్రేణులు పోటా పోటీగా నినాదాలు చేశారు. స‌మాచారం తెలుసుకున్న పోలీసులు ఇరు వ‌ర్గాల కార్య‌క‌ర్త‌ల‌ను చెద‌ర‌గొట్టేందుకు లాఠీఛార్జ్ చేశారు.

అయితే, సాయంత్రం 6 గంట‌లు దాటిన త‌రువాత కూడా మంగ‌ళ‌గిరిలో పోలింగ్ జ‌రిగింది. నియోజ‌క‌వ‌ర్గంలోని కొన్ని పోలింగ్ కేంద్రాల్లో రాత్రి 8 గంట‌లు దాటిన త‌రువాత కూడా పోలింగ్ జ‌రిగింది. దీంతో నారా లోకేష్ తాడేప‌ల్లి క్రిస్టియ‌న్‌పేట పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. వైసీపీ నేత‌లు అక్ర‌మాల‌కు పాల్ప‌డుతున్నారంటూ లోకేష్ ధ‌ర్నాకు దిగారు.