కంగనా సినిమా పై వివాదం మొదలైంది..!

0
199
kangana 'mental hai kya' movie

కంగనా రనౌత్ తాజా చిత్రం ‘మెంటల్ హై క్యా’ సినిమా జూన్ 21వ తేదీన విడుదల కాబోతుంది. ఈ సినిమాకి సంబందించిన ఫస్ట్ లుక్ ను ఈ మధ్యే విడుదల చేశారు. అయితే ప్రస్తుతం ఈ సినిమా పోస్టర్ పెద్ద తంటా తెచ్చి పెట్టింది. సినిమా టైటిల్ కి తగ్గ్గట్టుగానే .. హీరో రాజ్ కుమార్ రావ్, కంగనా ఎదురెదురు నిలుచుని వారి నాలుకలపై ఒకే బ్లేడ్ ని నిలుచోపెట్టారు. ఇందులో కంగనా రింగురింగుల పొట్టి జుట్టు వేసుకొని మస్తు మాస్ గా కనిపించింది. ప్రస్తుతం ఈ ఫస్ట్ లుక్ మీదే వివాదం ఏర్పడింది. ఎప్పుడు ఎదో వివాదంలో చిక్కుకునే ఈ అమ్మడికి కొత్త చిక్కే పడింది.

‘మెంటల్ హై క్యా’ చిత్ర కంటెంట్ మీద ‘ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ ‘ అభ్యంతరం వ్యక్త పరుస్తూ ‘సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్’ వారికి లేఖ ను పంపారు. వారు పంపిన లేఖలో చాలానే అంశాలను జోడించారు. ముఖ్యంగా సినిమా టైటిల్ మీదే చెప్పారు. మెంటల్ డిజార్డర్ ఉన్న వారిని కించ పరిచినట్లు పేరు పెట్టారు. మెంటల్ డిజార్డర్ ఉన్న వాళ్లను కించ పరిచేలా.. వారిని అగౌరవ పరిచేలా ఒక్క సీన్ కూడా ఉండకూడదు. అలాంటివి ఏమైనా ఉంటె తొలగించేయాలంటూ తెలిపారు. అంతే కాకుండా “మెంటల్ హెల్త్ కేర్ యాక్ట్ 2017” ప్రకారం మెంటల్ హెల్త్ కి సంబందించిన టాపిక్ ల ఫై కనీస అవగాహన ఉండాలి .. ఇది ప్రతి భారతీయ పౌరుల భాద్యత. అంటూ లేఖలో పొందుపరిచారు.

‘ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ ‘ వ్యక్తం చేసిన అభ్యంతరం మీద ఇప్పటివరకు ఎవరు స్పందించలేదు. ఇక కంగనా నోరు తెరిస్తే .. ఎం మాట్లాడుతుందో.. ఎం ప్రళయం రాబోతుందో చూడాలి. బాలాజీ టెలీ ఫిలిమ్స్ పతాకం పై ఏక్తా కపూర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు కే రాఘవేంద్ర రావు కుమారుడు ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వం వహిస్తున్నారు.