మెగాస్టార్ చిరంజీవికి వైసీపీ ఎమ్మెల్యే కృత‌జ్ఞ‌త‌లు..!

0
387

జ‌ర్న‌లిస్టు వృత్తిని ఒక సామాజిక బాధ్య‌త‌గా భావించి ఏ విధంగా ప‌నిచేశానో.., అదే బాధ్య‌త‌గా శాస‌నస‌భ స‌భ్యునిగా ప‌నిచేస్తూ వ‌స్తున్నాన‌ని కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే కుర‌సాల క‌న్న‌బాబు అన్నారు. కాగా, ఈ రోజు ఆయ‌న ఏపీ మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేసిన అనంత‌రం మీడియాతో మాట్లాడారు. తాను ఇండిపెండెంట్‌గా పోటీచేసిన స‌మ‌యంలో త‌న‌కు 44 వేల ఓట్లు వ‌చ్చాయ‌ని, సీఎం జ‌గ‌న్ నాడు త‌న‌ను గుర్తించి జిల్లా వైసీపీ బాధ్య‌త‌లు అప్ప‌గించార‌ని చెప్పారు.

కాకినాడ ఎమ్మెల్యేగా తాను మ‌ళ్లీ గెలుపొంద‌డానికి ప్ర‌ధాన కార‌ణం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి అని, ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ‌ను, ముగింపు స‌భ‌ను ఇలా రెండు ద‌ఫాలుగా త‌న గెలుపు కోసం జ‌గ‌న్ కాకినాడ‌లో ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వహించార‌ని కుర‌సాల క‌న్న‌బాబు తెలిపారు.

త‌న జీవిత కాలంలో మంత్రి అవుతాన‌ని అనుకోలేద‌ని, మంత్రిగా త‌న‌కు అవ‌కాశం ఇచ్చిన సీఎం జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డికి త‌న ఆజ‌న్మాంతం రుణ‌ప‌డి ఉంటాన‌ని చెప్పారు. అలాగే తాను అస‌లు రాజ‌కీయాల్లోకి రావ‌డానికి ప్ర‌ధాన కార‌ణ‌మైన మెగాస్టార్ చిరంజీవికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. చిరంజీవికి తాను ఎప్ప‌టికీ రుణ‌ప‌డి ఉంటాన‌న్నారు.