‘బాబాయి’కి మద్దతుగా ‘అబ్బాయి’ ఏం చేశాడో చూడండి ..! మెగా హీరో

0
132
ram charan
mega pawan star twet on janasena party

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమాకి బ్రేక్ వచ్చిన విషయం తెలిసిందె. జిమ్ చేస్తుండగా రామ్ మడిమకు గాయమవ్వగా దర్శక ధీరుడు వేసుకున్న బిజీ షెడ్యూల్ కి సడన్ బ్రేక్ ఏర్పడింది. ఈ కారణంగా వడోదర నుంచి హైదరాబాద్ కి వచ్చేశారు మెగా హీరో. మూడు వారల పాటు విశ్రాంతి తీసుకోవాలని వచ్చిన రామ్ చరణ్ వచ్చి రాగానే అబ్బాయి కాస్త బాబాయ్ కి తన వంతుగా ఎన్నికల వేల సపోర్ట్ చేస్తున్నాడు. బహిరంగంగా ప్రచారం చేయలేని పరిస్థితులలో ఉన్న మెగా పవర్ స్టార్ సోష‌ల్ మీడియా ను వేదికగా చేసుకొని ప్రచారాన్ని చేస్తున్నాడు.

రామ్ ఎంచక్కా ఇంట్లో ఉండే ట్విట్టర్ ద్వారా జ‌న‌సేన పార్టీ గూర్చి పోస్ట్ చేస్తున్నాడు. మార్పు రావాలంటే జనసేన జనంలోకి, అధికారం లోకి రావాలని ఇప్పటికే ఎన్నో సార్లు చెప్పాడు. తన ట్విట్టర్ లో  ‘జనసేన మేనిఫెస్టో చూసాను చాలా బాగుంది. అన్ని వర్గాల వారికి సమన్యాయం చేసేలా ఉంది. ఆల్ ది బెస్ట్ క‌ళ్యాణ్ బాబాయి, జ‌న‌సేన కార్య‌కర్త‌ల‌కు… అభ్యర్థులకు.. అంటూ ఓట్ ఫ‌ర్ గ్లాస్’ అని పెట్టారు. తనవంతుగా వచ్చి రాగానే జనసేన పార్టీ కి మద్దతు ఇస్తున్నాడు. జనసేన రావాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు చ‌ర‌ణ్.

ram tweet on jana ssena party
ram tweet on jana ssena party