యువతకు స్ఫూర్తిగా నిలిచిన మెగా హీరో

0
117

మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ భర్త కళ్యాణ్ దేవ్ తన మొదటి సినిమా ‘విజేత’ అనే చిత్రంతో హీరోగా టాలీవుడ్ కు పరిచయం అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాతో విజేతగా నిల్వలేక పోయిన కళ్యాణ్ దేవ్ తన నిజ జీవితంలో లో మాత్రం హీరోగా – విజేతగా ప్రశంసలు అందుకుంటున్నాడు. ఈ రోజు కళ్యాణ్ దేవ్ పుట్టిన రోజు. ఈ పుట్టిన రోజు సందర్బంగా స్నేహితులతో కానీ ఇంట్లో కానీ పార్టీలు చేసుకునే వారిని చూశాం. అలాకాకుండా కళ్యాణ్ దేవ్ మాత్రం అతను మరణించిన తర్వాత అవయవాలను దానం ఇవ్వటానికి నిర్ణయం తీసుకున్నాడు. ఇందుకోసం అపోలో హెల్త్ కేర్ ఆసుపత్రికి వెళ్లి తన అవయవాలను దానం చేస్తునట్టు బాండ్ పేపర్ పై రాసి ఆ పేపర్ ను అపోలో ఆసుపత్రికి యాజమాన్యానికి అందజేశారు.

మరణించిన తర్వాత అవయవాలు మట్టిలో కలిసిపోకుండా అవయవదానం ఇవ్వమంటూ చాల వరకు స్వచ్చంద సంస్థలు అందరికి పిలుపునిస్తున్నాయి. కానీ ఎవరు దీనిపైనా ఆసక్తి చూపించటం లేదు. కానీ కళ్యాణ్ దేవ్ ముందుకు రావడం హర్షనీయం. కళ్యాణ్ దేవ్ నిజమైన హీరో అనిపించుకున్నాడంటూ సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ అభినందనలు తెలుపుతున్నారు. తాను చేసిన అవయవదానం చేసిన విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెళ్లడించాడు. మనం చనిపోయాక మన తోడుగా ఏమి తీసుకొనివెళ్ళలేం అని కల్యాణ్ దేవ్ ట్వీట్ లో తెలిపాడు.