జ‌గ‌న్, చంద్ర‌బాబుకి నాగ‌బాబు స‌పోర్ట్.!

0
163

ఎన్నిక‌లకు ముందు టీడీపీ అధినేత చంద్ర‌బాబు, వైసీపీ అధినేత జ‌గ‌న్ ల‌ను టార్గెట్ చేసిన మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు స్వ‌రం మార్చారు. ఓడిపోయిన నేతలను విమర్శడం చేతకాని తనం అంటూ చంద్రబాబుకు మద్దతుగా నిలిచారు. ఏపీ ఎన్నికల్లో టీడీపీ ఘోర ఓటమిని చవిచూడడంతో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుపై సోషల్‌మీడియాలో కొంతమంది ట్రోల్ చేస్తున్నారు..

ఇలా ట్రోలింగ్ చేస్తూ పైశాచిక ఆనందం పొందడాన్ని నాగబాబు ఖండిస్తూ తన సోష‌ల్ మీడియా ఖాతాలో పోస్ట్ పెట్టారు. అంతేకాదు, అటు ఘ‌న‌విజ‌యం సాధించిన జ‌గన్ను ఉద్దేశించి కూడా నాగ‌బాబు పోస్ట్ చేశారు. జ‌గ‌న్ కు ఒక ఏడాది టైం ఇచ్చి స‌రైన మార్గంలో ప‌య‌నించ‌క‌పోతే విమ‌ర్శించాలి కాని ఇప్పుడే విమ‌ర్శ‌లు చేయ‌డం క‌రెక్ట్ కాద‌న్నారు.