బాలీవుడ్ భామలంతా.. స్టెప్స్ వేస్తే.. ! వైరాలవుతున్న వీడియో..!

0
164
maneesh malhothra arranged the party

బాలీవుడ్ లో ఎంత చిన్న సంతోషకరమైన విషయమైన అందరితో పంచుకుని పార్టీ చేసుకుంటారు. ఇక సెలబ్రెటీలంతా ఒకే దగ్గర కలిసి సందడి చేస్తుంటారు. తాజాగా ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా ఒక గెట్ టూ గెథెర్ ను ఏర్పాటు చేశారు. అంతే ఇక బాలీవుడ్ భామలంతా మస్తీగా డాన్స్ చేశారు. అలన్తి ఫుల్ జోష్ లో ఉన్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా లో చెక్కర్లు కొడుతుంది.

ఒకే జెనెరేషన్ బాలీవుడ్ బ్యూటీ లంతా కలిసి ఒక్క చోటే చేరి పార్టీ లో రచ్చ రచ్చ చేశారు. సోనాక్షి సిన్హా, తారా సుతారియ, అదితి రావు హైదరీ, అనన్య పాండే కైరా అద్వాని.. తదితరులు ఈవెంట్ కి హాజరయ్యారు. ఈ వేడుకలో వరుణ్ ధావన్, కైరా. సోనాక్షి సిన్హా కలిసి ‘కళంక్’ చిత్రం లోని ఫస్ట్ క్లాస్ సాంగ్ కు స్టెప్స్ వేశారు. వీరు మాత్రమే కాకుండా ఈవెంట్ హోస్ట్ మనీష్ మల్హోత్రా తో కూడా స్టెప్స్ వేపించారు. ఈ వీడియో చూసి మీరు ఆనందించండి.