పూరి ‘రొమాంటిక్’లో… బాలీవుడ్ బేడీ..!

0
251
Mandira bedi
Mandira bedi acting in Romantic movie

కైపెక్కించే మత్తెక్కించే అందం తన సొంతమా? అందానికి చిరునామా? అన్నట్లు ఉండే బాలీవుడ్ నటి మందిరా బేడీ టాలీవుడ్ లోకి అరంగేట్రం చేస్తుంది. వరల్డ్ కప్ పోటీల సమయాన ఆమె ఒక వ్యాఖ్యాతగా వ్యవహరించి వయ్యారాలు వలకబోసిన తీరును క్రీడాభిమానులు ఇప్పటికీ మరచిపోలేక పోతున్నారు. ఈ అమ్మడు అప్పుడప్పుడు చిత్రాలను చేస్తూ, మరో పక్క ఫ్యాషన్ షోలలో పార్టిసిపేట్ చేస్తుంటుంది. ఎక్కువగా టూ పీస్ లలో దర్శనమిస్తూ వీక్షకుల మతులు పోగొడుతుంది. మద్యమద్యలో  టీవీ షోలను కూడా చేస్తూ ఎందరో ఫాన్స్ ని సొంతం చేసుకుంది. ఇక ఈ హాట్ భామ తెలుగులోనూ రెండు సినిమాలలో నటిస్తుంది . ఒకటి ప్రభాస్ నటిస్తున్న సాహూ చిత్రమైతే, మరొకటి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్స్తున్న సినిమా.

అనిల్ పాదూరి దర్శకత్వంలో యువతను ఆకట్టుకునే ప్రేమకథతో తెరకెక్కుతున్న చిత్రం ‘రొమాంటిక్’. ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరీ కథానాయకుడిగా తెరకెక్కుతున్న రెండో చిత్రం. పూరీ జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్ ల పై పూరీ జగన్నాథ్, చార్మి కలిసి నిర్మిస్తున్నారు. ఆకాష్ కు జోడిగా సోషల్ మీడియాలో ఫేమ్ అయినా ఢిల్లీ హాట్ బ్యూటీ కేతికా శర్మ నటిస్తుంది. రొమాంటిక్ చిత్రం మొదటి షెడ్యూల్ హైదరాబాద్‌లో పూర్తయింది. రెండో షెడ్యూల్ గోవాలో జరుగుతున్న సంగతి అందరికి తెలిసిందే.

ప్రస్తుతం గోవాలో ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగా, ఒక ఇంట్రెస్టింగ్ విషయం బయటకొచ్చింది. బాలీవుడ్ అందాల నటి మందిరాబేడి రొమాంటిక్ లో ప్రధానమైన పాత్ర చేస్తుందట. మందిర పూర్తిగా నెగెటివ్ రోల్ ఉన్న పాత్ర ను చేయబోతోందని తెలిసింది. గోవాలో జరుగుతున్న చిత్ర టీమ్‌తో సుందరి యాడ్ అయిందని వార్తలు వచ్చాయి. ఇప్పటికే ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నా మందిరా బేడీ తెలుగులో కుర్ర కారుకి కిర్రాకు తెచ్చేలా నటించబోతుందట. ఈ రొమాంటిక్ సినిమాలో హీరో, హీరోయిన్ , స్టోరీ పక్కకు పెట్టేస్తే సుందరాంగైనా మందిరబేడీ కోసం మాత్రం అభిమానులు ఎదురుచూస్తారన్నది మాత్రం నిజము.