బ్రేకింగ్ న్యూస్ : TRS గూటికి మండవ వెంకటేశ్వరరావు

0
289
బ్రేకింగ్ న్యూస్ : TRS గూటికి మండవ వెంకటేశ్వరరావు
బ్రేకింగ్ న్యూస్ : TRS గూటికి మండవ వెంకటేశ్వరరావు

అందరూ అనుకున్నట్లుగానే మాజీ మంత్రి, TDP నేత “మండవ వెంకటేశ్వరరావు” సైతం TRS తీర్థం పుచ్చుకున్నారు. ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. శుక్రవారం జూబ్లీహిల్స్‌ లోని మండవ వెంకటేశ్వరరావు నివాసానికి స్వయంగా వెళ్లిన ముఖ్యమంత్రి.. ఆయనను TRS పార్టీలోకి ఆహ్వానించారు. కొద్దిసేపు ఇరువురు నేతలు ముచ్చటించిన అనంతరం కేసీఆర్‌ వెంటే ప్రగతిభవన్‌కు వచ్చిన మండవ పార్టీ మారేందుకు సుముఖత వ్యక్తంచేశారు.

అందులో బాగంగానే ఈరోజు CM సమక్షంలో TRS లో చేరారు. మండవ వెంకటేశ్వరరావుతో పాటు కాంగ్రెస్‌ నేత “వద్దిరాజు రవిచంద్ర” సైతం TRS గూటికి చేరారు. ఈమద్య జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్‌ తూర్పు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేసిన “రవిచంద్ర” ఓటమిపాలయ్యారు. ఇలా అందరూ ముఖ్య నేతలు కూడా TRSలోకి రావడంతో తెలంగాణలో కే‌సి‌ఆర్ కు పోటీ లేదనే పరిస్థితి నెలకొంది.

Read Also: చంద్ర‌బాబు అడ్డాలో అడుగుపెట్టిన వైఎస్‌ జ‌గ‌న్..!