ఎగ్జిట్‌పోల్స్ స‌ర్వేను రిలీజ్ చేసిన మ‌మ‌తా బెన‌ర్జీ..!

0
188

దేశ వ్యాప్తంగా జ‌రిగిన 2019 పార్ల‌మెంట్ ఎన్నిక‌ల ఫ‌లితాలు మ‌రో మూడు రోజుల్లో తేల‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో కేంద్రంలో బీజేపీనే మ‌ళ్లీ అధికారంలోకి వ‌స్తుంద‌ని, న‌రేంద్ర మోడీనే మ‌ళ్లీ ప్ర‌ధాని కానున్నార‌ని ఆ పార్టీ నేత‌లు ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. గ‌త ఐదేళ్లుగా మోడీ సంక్షేమ‌ పాల‌న చూసిన ప్ర‌జ‌లు జరిగిన ఎన్నిక‌ల్లో బీజేపీకే ప‌ట్టం క‌ట్టార‌ని, ఆ విష‌యం ఈ నెల 23న వెల్ల‌డికానున్న ఫ‌లితాల‌తో స్ప‌ష్టమ‌వుతుంద‌ని చెబుతున్నారు.

దేశ వ్యాప్తంగా జ‌రిగిన పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో బీజేపీకి త‌క్కువ‌లో త‌క్కువ‌గా 300 స్థానాలను కైవ‌సం చేసుకుంటామంటూ ఆ పార్టీ నేత‌లు చెబుతండ‌గా, ప‌శ్చిమ‌బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ మాత్రం వారి మాట‌ల‌ను కొట్టిపారేస్తున్నారు. బీజేపీకి 300 సీట్లు కాదు క‌దా.., క‌నీసం వంద సీట్ల‌ను కూడా సాధించ‌లేద‌ని మ‌మ‌తా బెన‌ర్జీ చెబుతున్నారు. అంతేకాకుండా ఇరుగు పొరుగు రాష్ట్రాలు ఏపీ, తమిళ‌నాడులో బీజేపీ ఒక్క‌టంటే.. ఒక్క ఎంపీ సీటును కూడా గెలుపొంద‌లేద‌ని ఆమె చెప్పారు.

బీజేపీకి ఎక్కువ సీట్లు వ‌చ్చే రాష్ట్రాల్లో మ‌హారాష్ట్ర ఒక‌ట‌ని, అక్క‌డ బీజేపీకి 20 పార్ల‌మెంట్ స్థానాలు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని, త‌న పాల‌న కొన‌సాగుతున్న ప‌శ్చిమ బెంగాల్‌లో మాత్రం తృణ‌మూల్ కాంగ్రెస్‌కు 23 పార్ల‌మెంట్ స్థానాలు వ‌స్తాయంటూ మ‌మ‌తా బెన‌ర్జీ ధీమా వ్య‌క్తం చేశారు.