50 కోట్ల క్లబ్‌కి..‘మజిలీ’ కలెక్షన్..!

0
104
majili collection
majili reached 50 crores collection

శివ నిర్వాణ దర్శకత్వం వహించిన సినిమా మజిలీ. నాగచైతన్య, సమంత జంటగా నటించిన సినిమా ఈ నెల ఐదొవ తేదీన తెరమీదకు వచ్చింది. రొమాంటిక్ ఎమోషనల్ ఎంటెర్టైన్టైన్మెంట్ చిత్రంగా రూపుదిద్దిన సినిమా మొదటి రోజే భారీ వసూళ్లను తెచ్చి పెట్టింది. అభిమానులంతా మొదటి రోజు వచ్చిన వసూళ్లను చూసి ఖచ్చితంగా 50 కోట్లను తెచ్చి పెట్టడం ఖాయమని అభిప్రాయపడ్డారు. వారందరు అనుకున్నట్టుగానే ఈ చిత్రం ఎంతో తేలికగా 50 కోట్ల రూపాయలకు చేరింది.

చైతూ కి కొన్ని రోజులుగా సరైన హిట్ లేదు. మజిలీ మొదలైనప్పటి నుంచి అత్యధిక వసూళ్లను చేపట్టింది. మజిలీ యాభై కోట్ల క్లబ్ లోకి చేరి.. చైతు కెరియర్ లో నిలచిపోయింది. ఇక ఈ సినిమాతో పరిచయమైన దివ్యాంశ కౌశిక్ కెరీర్ కూడా మంచి మలుపు తిరిగింది. ఈ చిత్రం 50 కోట్లను వసూళ్లు చేసినట్లు చిత్ర యూనిట్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.

majili world wide gross