సినిమా విడుదలకి ముందే హిట్ కొట్టిన ‘మహర్షి’..! మహేష్ కి మాత్రమే సాధ్యం

0
250
maharshi movie rights total 140 crores crossed

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ బాబు 25 వ చిత్రంగా తెరకెక్కుతున్న సినిమా ‘మహర్షి ‘. మహేష్ , పూజ హెగ్డే , నరేష్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. భరత్ అనే నేను సినిమా భారీ హిట్ కావడంతో ఇప్పుడు రాబోతున్న సినిమా పై ప్రేక్షకులు మరిన్ని ఆశలతో ఎదురుచూస్తున్నారు. దానికి తగ్గట్టుగానే చిత్ర బిజినెస్ భారీ గా జరిగింది. 140 కోట్ల బిజినెస్ జరిగి టాలీవుడ్ రికార్డు ని సొంతం చేసుకుంది. ఈ సినిమా డిజిటల్, శాటిలైట్, డబ్బింగ్ హక్కులు 47.50 కోట్లు రూపాయలు వచ్చినట్లు ట్రేడ్ వర్గాల వారు తెలిపారు.

తెలుగు శాటిలైట్ రైట్స్ 14. 5 కోట్లు రూపాయలు, హిందీ డబ్బింగ్, శాటిలైట్ రైట్స్ 20 కోట్ల రూపాయలు ,డిజిటల్ రైట్స్ 11 కోట్ల రూపాయలు , ఆడియో రైట్స్ 2 కోట్ల రూపాయలు వచ్చాయట. ఓవర్సీస్ లో దాదాపుగా 12.5 కోట్ల రూపాయలు ఈ విదంగా ఆంధ్ర ,రాయలసీమ, తెలంగాణ ప్రాంతాలతో మొత్తం కలిపి 140కోట్ల రూపాయల కన్నా ఎక్కువేనని సమాచారం. మహేష్ కెరియర్ లో ఆల్ టైమ్ రికార్డు అంతే కాకుండా టాలీవుడ్ లో రికార్డు కొట్టాడు. దేవిశ్రీ సంగీతం అందించగా..ఈ సినిమాను దిల్‌ రాజు, అశ్వనీదత్‌, పీవీపీలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.