రాహుల్ గాంధీ కావాలంటూ ప్రపోజ్ చేసిన శృంగార తార : వైరల్ పోస్టు

0
177
రాహుల్ గాంధీ కావాలంటూ ప్రపోజ్ చేసిన శృంగార తార : వైరల్ పోస్టు
రాహుల్ గాంధీ కావాలంటూ ప్రపోజ్ చేసిన శృంగార తార : వైరల్ పోస్టు

నేను కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో పీకల్లోతు ప్రేమలో ఉన్నాను… ఆయనంటే నాకు చాలా చాలా ఇష్టం… ఎందుకంటే రాహుల్ గాంధీ తన చేష్టలతో, మాటలతో జనాలను నవ్విస్తూనే ఉంటారు. అంటూ శృంగార తార మహిక శర్మ తన “ఇన్‌‌స్టాగ్రామ్‌”లో రాహుల్ గాంధీ ఫోటోని పోస్ట్ చేసి మరోసారి హల్ చెల్ చేసింది. ఎలాగైనా దేశ ప్రదాని కావాలని రాహుల్ గాంధీ కష్టపడుతుంటే అతడిపై “మహిక శర్మ” ఇలాంటి వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ అయ్యింది.

పైగా రాహుల్ లాగా జనాలను నవ్విస్తూ ఉండేవాళ్లంటే తనకెంతో ఇష్టమని… రాజు అంటే ఇలాగే ఉండాలని.. ప్రతి ఒక్కవ్యక్తి ముఖాల్లో నవ్వులు నింపడమే రాజు యొక్క కర్తవ్యం అంటూ హిందీలో కామెంట్ కూడా పెట్టింది మహిక శర్మ. ఆమె లవ్ ప్రపోజల్‌ పై రాహుల్ స్పందించకపోయినా నెటిజన్స్ మాత్రం ఈ అమ్మడిపై విరుచుకుపడుతున్నారు. ఎవరి పట్టుకొని ఏం మాట్లాడుతున్నావ్ ? అతడు దేశానికి కాబోయే ప్రధాని అంటూ కాంగ్రెస్ కార్యకర్తలు ఆమెను భూతులు తిడుతున్నారు.